గంజాయి కి అలవాటు పడ్డ యువతకు చెంపపెట్టు

గంజాయి కి అలవాటు పడ్డ యువతకు చెంపపెట్టు " RKపురం లో ,"

1 month ago | 40 Views

పవన్ దీపిక ఆర్ట్స్ పతాకంపై రవికిరణ్, త్రిషల, రక్ష హీరోహీరయిన్లుగా శ్రీకర్ ప్రసాద్  కట్టా దర్శకత్వంలో నిర్మాత రవికిరణ్ గుబ్బల నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్  "'RK పురంలో'".   ఈ చిత్రం ఇటీవల పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. రీసెంట్ గా సెన్సార్ కి రెడీ అయ్యింది.

ఈ సందర్భగా చిత్ర దర్శకుడు శ్రీకర్ ప్రసాద్ కట్టా మాట్లాడుతూ" అర్ కె పురంలో మంచి కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్.నేటి యువత డ్రగ్స్ బారిన పడి  ఎటువంటి వ్యసనాలకు లోనవుతున్నారు, వారి వల్ల సమాజంలో ఎటువంటి ప్రతికుల పరిస్థితులు మహిళలు ఎదుర్కుంటున్నారు అనేది ఈ చిత్ర కథాంశం. గంజాయి కి అలవాటు పడ్డ యువతకు చెప్ప పెట్టు లాంటిది ఈ చిత్రం.హీరో రవి కిరణ్ కొత్తవాడైన  చాలా చక్కగా నటించాడు. అన్ని హంగులతో ఈ సినిమాను త్వరలో  రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

చిత్ర నిర్మాత గుబ్బల రవి కిరణ్ మాట్లాడుతూ"సమాజానికి ఉపయోగ పడే  మంచి పవర్ ఫుల్ హీరో క్యారెక్టర్ చేస్తున్నాను మా చిత్రంలో యూత్  కావలసిన అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయి. నేడు ఆంధ్ర రాష్ట్రం లో ప్రతి గ్రామం గంజాయి వంటి మత్తు పదార్ధాలతో నిండిపోయి వుంది.మా చిత్రం చూసిన తర్వాత  మత్తులో జోగుతున్న కొంత మంది అయినా  వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకుంటారన్న ఆశ భావంతో  వున్నాము.ప్రస్తుతం  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు  పూర్తయ్యాయి. సెన్సార్ కార్యక్రమాలు ఈ వారంలో పూర్తి చేసుకుని సినిమాను త్వరలో విడుదల చేయాలనుకుంటున్నాం, అని అన్నారు.

పవన్ దీపిక ఆర్ట్స్

హీరో - రవి కిరణ్ 

హీరోయిన్ - త్రిషల

II హీరోయిన్ - రక్ష

సమర్పించు గుబ్బల విజయ హేమ దీపిక

డైరెక్టర్ - శ్రీకర్ ప్రసాద్ కట్టా

నిర్మాత - రవి కిరణ్ గుబ్బల

సహ నిర్మాత - జక్కంపూడి శ్రీనివాస్ శ్రీదేవి

సంగీతం - రాజ్ కిరణ్

ఎడిటర్ - డి.కె

కెమెరా - K. వాసుదేవన్

మాటలు - శ్రీ కుమార్ దలిపర్తి

నిర్మాణ నిర్వహణ - వాసంశెట్టి రాజేంద్రప్రసాద్

పి అర్ ఓ: బాశింశెట్టి వీరబాబు

ఇంకా చదవండి: ‘విద్య వాసుల అహం’ టీజర్ విడుదల

# RK Puramlo     # Ravi Kiran     # Trishala