
ఆకట్టుకుంటున్న హరి హర వీరమల్లు పోస్టర్!
1 month ago | 5 Views
హరి హర వీరమల్లు నుంచి వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ కూల్ పోస్టర్‌ను వదిలారు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ ఈ పోస్టర్‌లో ఎంతో చూడముచ్చటగా కనిపిస్తున్నారు. ఈ ఇద్దరికి మంచి రొమాంటిక్ సాంగ్ కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. కొల్లగొట్టినాదిరో అంటూ సాగే రెండో పాటను ఫిబ్రవరి 24న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ రెండో పాటకు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. మాట వినాలి అంటూ వదిలిన ఫస్ట్ సింగిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ఆలస్యం అవుతూనే వస్తోంది.
మార్చి 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారని యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మధ్యలో ఈ మూవీని వాయిదా వేస్తారని అన్నారు. రెండు పార్టులుగా సినిమాను విడగొట్టిన సంగతి తెలిసిందే. మొదటి పార్టుని చాలా వరకు క్రిష్ కంప్లీట్ చేశాడు. కానీ ఇప్పుడు ఈ ప్యాచ్ వర్క్‌లు మిగతా పనుల్ని ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ కంప్లీట్ చేస్తున్నాడు. హరి హర వీరమల్లు రెండో పార్ట్ మొత్తాన్ని కూడా జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తాడు. అసలు ఈ మొదటి పార్ట్ షూటింగ్ ఎప్పుడు ఫినిష్ అవుతుందా? అని అంతా ఎదురుచూస్తున్నారు. చెప్పిన టైంకి సినిమాను డెలివరీ చేస్తారా? అనే అనుమానం అందరిలోనూ ఉంది.
ఇంకా చదవండి: ఆ హీరోతోనే మోహన్‌బాబు బయోపిక్ తీస్తా : మంచు విష్ణు
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# హరి హర వీరమల్లు # పవన్ కల్యాణ్