జనక అయితే గనక ..నవ్విస్తుందట !
3 months ago | 41 Views
సుహాస్, సంకీర్తన జంటగా నటిస్తున్న 'జనక అయితే గనక’ ఈ నెల 7న విడుదల కానుంది. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో హర్షిత్‌రెడ్డి, హన్షిత నిర్మించారు. శిరీష్ సమర్పకుడు. సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌విూట్‌లో దిల్ రాజు మాట్లాడుతూ’సుహాస్ ప్రతి సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. కొత్త కథలు అందించే ప్రయత్నం చేస్తున్నాడు. 'జనక అయితే గనక’ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఆద్యంతం నవ్విస్తుంది’ అని చెప్పారు. సుహాస్ మాట్లాడుతూ ’కథ విన్నప్పుడు నవ్వుతూనే ఉన్నా. ఈ సినిమాను ఓవర్సీస్ లో రిలీజ్ చేస్తున్నా’ అని చెప్పారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ కథ బాగుందని మెచ్చుకున్నారని దర్శకుడు సందీప్ రెడ్డి చెప్పారు.
ఇంకా చదవండి: అందాల ఆరబోతలో మాళవిక!