'డబుల్ ఇస్మార్ట్' లో బోల్డ్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను. సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది: హీరోయిన్ కావ్య థాపర్
4 months ago | 36 Views
ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‌లో మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్' సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా కావ్య థాపర్ నటించింది. డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ కావ్య థాపర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
'డబుల్ ఇస్మార్ట్' ప్రాజెక్ట్స్ లోకి ఎలా వచ్చారు ?
పూరి సర్, ఛార్మి గారిని కలసి ఆడిషన్స్ ఇచ్చాను. నా ఆడిషన్ వారికి నచ్చింది. అయితే సమయంలో ఓ చిన్న యాక్సిడెంట్ గా కారణంగా కాస్త వెయిట్ పెరిగాను. కొంచెం వెయిట్ తగ్గమని చెప్పారు. రెండు నెలలు హార్డ్ వర్క్ చేసి వెయిట్ తగ్గాను. పూరి గారు క్రియేట్ చేసిన క్యారెక్టర్ కి ఫిట్ అయ్యాను.
ఇంత అద్భుతమైన కాంబినేషన్ వున్న సినిమాలో వర్క్ చేయడం చాలా లక్కీగా ఫీలౌతున్నాను. రామ్ గారు, సంజయ్ దత్ లాంటి బిగ్ స్టార్ కాస్ట్ వున్న సినిమాలో నేనూ పార్ట్ కావడం చాలా హ్యాపీగా వుంది. అలాగే పూరి గారు, మణిశర్మ గారి కాంబో చాలా ఫేమస్. అలాంటి కాంబో లో వర్క్ చేయడం చాలా థ్రిల్ ఇచ్చింది.
నాకు పూరి జగన్నాథ్ గారి హీరోయిన్ అవ్వాలని వుండేది. ఇస్మార్ట్ శంకర్ కి ఆడిషన్ ఇచ్చాను కానీ కుదరలేదు. ఇప్పుడు డబుల్ ఫన్, ఎంటర్ టైన్మెంట్ వుండే ఈ సినిమాలో అవకాశం రావడం మరింత హ్యాపీగా వుంది. పూరి గారు గ్రేట్ డైరెక్టర్. ఆయన విజన్ చాలా అద్భుతంగా వుంటుంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.
ఇందులో మీ క్యారెక్టర్ ఎలా వుండబోతోంది ?
ఇందులో నా క్యారెక్టర్ చాలా బోల్డ్ అండ్ స్ట్రాంగ్ గా వుంటుంది. ఏదైనా సొంతగా నేర్చుకునే అమ్మాయి. తను చాలా స్మార్ట్, అదే సమయంలో తనలో ఇన్నోసెన్స్ కూడా వుంటుంది. ఇందులో నాకు ఫైట్ సీన్స్ కూడా వున్నాయి. ఒక యాక్టర్ గా ఎప్పటినుంచో ఇలాంటి క్యారెక్టర్ చేయాలని కొరుకున్నాను. ఈ సినిమాతో అలాంటి క్యారెక్టర్ రావడం ఆనందంగా వుంది. ఈ క్యారెక్టర్ చేస్తున్నపుడు చాలా ఎంజాయ్ చేశాను.
రామ్ గారితో డ్యాన్స్ చేయడం ఎలా అనిపించింది ?
అదొక బెస్ట్ ఎక్స్ పీరియన్స్. సాంగ్ షూట్ లో ఫస్ట్ డే మార్నింగ్ సిక్ అయ్యాను. చాలా ఎనర్జీ, పవర్ కావాల్సిన సాంగ్ అది. సిక్ అవ్వడంతో చాలా అప్సెట్ అయ్యాను. అయినా సెట్ లోకి వచ్చాను. అయితే ఛార్మి గారు నన్ను చూసి ఇమ్మిడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. చాలా కేర్ తీసుకున్నారు. నా కారణంగా షూటింగ్ అప్సెట్ అవుతుందని చాలా బాధపడ్డాను. మూడు రోజుల తర్వాత డబుల్ ఎనర్జీతో డిస్ చార్జ్ అయ్యాను. నా బెస్ట్ డ్యాన్స్ ఇచ్చాను. టీం అంతా చాలా సపోర్ట్ చేశారు.
రామ్ గారు చాలా పాషనేట్ యాక్టర్, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. హైలీ ఎనర్జిటిక్ గా వుంటారు. తను అమెజింగ్ పర్సన్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మా కెమిస్ట్రీ ది బెస్ట్ వచ్చింది.
సంజయ్ దత్ గారితో మీకు కాంబినేషన్ సీన్స్ వున్నాయి ?
వున్నాయి. ఆయనతో వర్క్ చేయడం మైండ్ బ్లోయింగ్ ఎక్స్ పీరియన్స్. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన లెజండరీ యాక్టర్. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం డ్రీమ్ కమ్ ట్రూ లా అనిపించింది.
పూరి గారి నుంచి ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు ?
ఓర్పుగా వుండటంతో పాటు చాలా విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నాను. ఆయన విజన్ చాలా క్లియర్ గా వుంటుంది. సెట్ లో చాలా కూల్ గా వుంటారు. ఆయనలో మంచి ఫిలాసఫర్ కూడా వున్నారు. జీవితం పట్ల ఆయనకి వున్న క్లారిటీ అమెజింగ్.
ఛార్మి గారితో కలసి వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
ఛార్మి మేడమ్ బాస్ లేడీ. నన్ను చాలా కేరింగ్ గా చూసుకున్నారు. తను పవర్ హౌస్. చాలా ఫ్రెండ్లీ గా వుంటారు. హ్యాట్సప్ టు ఛార్మి గారు.
ఇస్మార్ట్ శంకర్ పెద్ద హిట్ అయ్యింది. డబుల్ ఇస్మార్ట్ ఎలా వుండబోతోంది ?
డబుల్ ఇస్మార్ట్ డబుల్ బ్లాక్ బస్టర్ వుంది. ఇస్మార్ట్ శంకర్ కి దీనికి కంపారిజన్ లేదు. కంప్లీట్ డిఫరెంట్ ఫిల్మ్. చాలా ఎంజాయ్ చేశాను. ఆగస్ట్ 15 కోసం ఎదురుచూస్తున్నాను.
డబుల్ ఇస్మార్ట్ మీ ఫేవరేట్ సాంగ్ ?
మార్ ముంత ఛోడ్ చింతా, స్టెప్పా మార్ నా ఫేవరేట్. అవి నా మైండ్ నుంచి పోవడం లేదు. అలాగే క్యా లఫ్డా ను కూడా ఎంజాయ్ చేశాను.
మణిశర్మ గారు లెజండరీ కంపోజర్. ఆయన సాంగ్స్ కి డ్యాన్స్ చేయడం లక్కీగా భావిస్తున్నాను.
డబుల్ ఇస్మార్ట్ హిందీలో కూడా రిలీజ్ అవుతుంది కదా ఈ ఫీలింగ్ ఎలా వుంది ?
డబుల్ ఇస్మార్ట్ స్ట్రయిట్ గా హిందీలో రిలీజ్ కావడం చాలా ఎక్సయిటింగ్ వుంది. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా ఇదొక బ్లెస్సింగ్ లా భావిస్తున్నాను.
ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని వుంది ?
నాకు యాక్షన్ రోల్స్ చేయాలని వుంది. యాక్షన్ చేయడం చాలా ఇష్టం. అలాగే అడ్వంచరస్ మూవీ చేయాలని వుంది.
మీ అప్ కమింగ్ మూవీస్ ?
గోపిచంద్ గారితో విశ్వం చేస్తున్నాను. మరికొన్ని ప్రాజెక్ట్స్ పైప్ లైన్ లో వున్నాయి.
ఇంకా చదవండి: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ #VS13 అనౌన్స్‌మెంట్, ప్రీ-లుక్ రిలీజ్
# DoubleiSmart # KavyaThapar # RamPothineni