హీరో కిరణ్ అబ్బవరం

హీరో కిరణ్ అబ్బవరం "క" సినిమా ట్రైలర్ రిలీజ్, యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటున్న ట్రైలర్

1 month ago | 5 Views

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్  సినిమా "క" ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌"క" సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.


"క" సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే.... చుట్టూ కొండల మధ్య ఉన్న కృష్ణగిరి అనే అందమైన ఊరిలో పోస్ట్ మ్యాన్ గా పనిచేస్తుంటాడు అభినయ వాసుదేవ్. మధ్యాహ్నమే చీకటి పడే ఆ ఊరు భౌగోళికంగా ఎంతో ప్రత్యేకం. అక్కడ సత్యభామ అనే అందమైన అమ్మాయితో ప్రేమలో పడతాడు వాసుదేవ్. ఉత్తరాలు పంచే క్రమంలో 1979 ఏప్రిల్ 22న అభిషేక్ పేరుతో వచ్చిన ఉత్తరం వాసుదేవ్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ ఉత్తరంలో ఏముందో చెప్పమంటూ ఓ ముసుగు వ్యక్తి వాసుదేవ్ ను బెదిరిస్తాడు. ఆ ఉత్తరంలో ఏముంది ?, వాసుదేవ్ ను ఆ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు ? అనే అంశాలు ఆసక్తిని కలిగించాయి. ట్రైలర్ చివరలో 'జాతర మొదలుపెడదామా..' అంటూ ముసుగు వ్యక్తిగా వాసుదేవ్ రావడం సర్ ప్రైజ్ ట్విస్ట్ ఇచ్చింది. గ్రిప్పింగ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా "" సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ తో తెలుస్తోంది. ట్రైలర్ లో హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఆకట్టుకున్నాయి.

నటీనటులు - కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, తదితరులు

టెక్నికల్ టీమ్

ఎడిటర్ - శ్రీ వరప్రసాద్

డీవోపీస్ - విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం

మ్యూజిక్ - సామ్ సీఎస్

ప్రొడక్షన్ డిజైనర్ - సుధీర్ మాచర్ల

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - చవాన్

క్రియేటివ్ ప్రొడ్యూసర్ - రితికేష్ గోరక్

లైన్ ప్రొడ్యూసర్ - కేఎల్ మదన్

సీయీవో - రహస్య గోరక్ (కేఏ ప్రొడక్షన్స్)

కాస్ట్యూమ్స్ - అనూష పుంజ్ల

మేకప్ - కొవ్వాడ రామకృష్ణ

ఫైట్స్ - రియల్ సతీష్, రామ్ కృష్ణన్, ఉయ్యాల శంకర్

కొరియోగ్రఫీ - పొలాకి విజయ్

వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ -ఎంఎస్ కుమార్

వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ - ఫణిరాజా కస్తూరి

కో ప్రొడ్యూసర్స్ - చింతా వినీషా రెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డి

ప్రొడ్యూసర్ - చింతా గోపాలకృష్ణ రెడ్డి

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

రచన దర్శకత్వం - సుజీత్, సందీప్

ఇంకా చదవండి: ఇప్పటిదాకా మీరు స్క్రీన్ మీద చూడని ఒక అద్భుతమైన మూవీ 'కంగువ' - గ్రాండ్ ప్రెస్ మీట్ లో స్టార్ హీరో సూర్య

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# క     # కిరణ్ అబ్బవరం     # నయన్ సారిక     # తన్వీ రామ్    

trending

View More