'ఇడ్లికడై' సినిమాతో   ప్రేక్షకుల ముందుకు హీరో ధనుష్‌

'ఇడ్లికడై' సినిమాతో ప్రేక్షకుల ముందుకు హీరో ధనుష్‌

1 month ago | 5 Views

ఈ ఏడాది 'రాయన్‌'తో హీరో కమ్‌ డైరెక్టర్‌గా సూపర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకున్న కోలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ ధనుష్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలను లైన్‌లో పెట్టాడు. వీరి కాంపౌండ్‌ నుంచి వస్తోన్న మరో చిత్రం 'ఇడ్లికడై'. ఈ చిత్రం షూటింగ్‌ను సైలెంట్‌గా మొదలు పెట్టి ఇప్పటికే అభిమానులకు సర్‌ప్రైజ్‌ చేశాడు.  ధనుష్‌-4గా వస్తోన్న ఈ చిత్రంలో నిత్యామీనన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా సినిమా విడుదల తేదీ ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ విడుదల చేశారు. ఈ మూవీని 2025 ఏప్రిల్‌ 10న విడుదల చేయనున్నారు. తాటాకుల పైకప్పుతో ఉన్న చిన్న రూం వైపు నడుచుకుంటూ వెళ్తున్న లుక్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఇంతకీ ఈ సారి ఎలాంటి స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ మూవీలో అరుణ్‌ విజయ్‌, సత్యరాజ్‌, అశోక్‌ సెల్వన్‌, రాజ్‌కిరణ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఆకాశ్‌ (డెబ్యూ) నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు. తిరు సినిమా తర్వాత ధనుష్‌, నిత్యామీనన్‌ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇంకా చదవండి: మూడు భాగాలుగా ‘రామాయణ’

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# ఇడ్లికడై     # ధనుష్‌     # నిత్యామీనన్‌    

trending

View More