హలో బేబీ ట్రైలర్ లాంచ్ చేసిన ఆది సాయికుమార్

హలో బేబీ ట్రైలర్ లాంచ్ చేసిన ఆది సాయికుమార్

1 month ago | 33 Views

ఎస్ కే ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాతగా,  రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో   కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా నటించిన సినిమా హలో బేబీ. ఈ చిత్రంలో కావ్య కీర్తి  సోలోగా నటించడం విశేషం. ప్రముఖ హీరో ఆది సాయికుమార్ ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ..ట్రైలర్ ను బట్టి చూస్తుంటే సోలో క్యారెక్టర్ తో ఒక సినిమా తీయడం చాలా మెచ్చుకోవలసిన విషయమని ఇప్పటికే ఎన్నో అవార్డులు పొందినటువంటి ఈ చిత్రం కచ్చితంగా మంచి హిట్ అవుతుందని హ్యాకింగ్ పై తీస్తున్నటువంటి మొదటి చిత్రంగా దీన్ని జనాలు గుర్తుంచుకుంటారని కొనియాడారు. 

నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూ ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చింది.  త్వరలోనే చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. భారతదేశంలోనే మొట్టమొదటి హాకింగ్ చిత్రంగా ఇప్పటికే పురస్కారనంది, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫెస్టివల్, దాదా  సాహెబ్ అవార్డులు  ఈ సినిమాకి వచ్చాయని అన్నారు. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి గల కారణం కెమెరామెన్ రమణ, ఎడిటర్ సాయిరాం తాటిపల్లి, మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ పమ్మి మరియు మా చిత్రంలో నటించినటువంటి హీరోయిన్ కావ్య కీర్తి వలన ఈ చిత్రం అద్భుతంగా వచ్చిందని కొనియాడారు.

ప్రత్యేకంగా మా డైరెక్టర్ రామ్ గోపాల్ రత్నం చేసిన కృషి మరువలేనిది చాలా మరువని సంఘటనలు ఈ షూటింగ్ దశలోని జరిగాయి అని చెప్పుకొచ్చారు.

ఇంకా చదవండి: ఇండియాలో తన మార్క్ ని చాటుకున్న 'డెడ్ పూల్ & వోల్వరిన్'.. మొదటి వారంలోనే 113.23 కోట్ల వసూళ్లు..

# Hellobaby     # Nanditaswetha     # AadiSaiKumar    

trending

View More