కిచ్చా సుదీప్‌తో 'హనుమాన్‌' మేకర్స్‌ చిత్రం!

కిచ్చా సుదీప్‌తో 'హనుమాన్‌' మేకర్స్‌ చిత్రం!

3 months ago | 33 Views

'హనుమాన్‌’తో  భారీ విజయం అందుకొంది  ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ. తాజాగా ఈ సంస్థ మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టింది. కిచ్చా సుదీప్‌ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ మేరకు సోమవారం సుదీప్‌ పుట్టినరోజును పురస్కరించుకొని సినిమా విశేషాలను వెల్లడించారు.  'విక్రాంత్‌ రోణ’ ఫేమ్‌ అనూప్‌ భండారీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.

ఈ చిత్రానికి ’బిల్లారంగా భాషా `ఫస్ట్‌ బ్లడ్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు.  భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈమేరకు కాన్సెప్ట్‌ వీడియో షేర్‌ చేశారు నిర్మాతలు నిరంజన్‌ రెడ్డి, చైతన్య.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

ఇంకా చదవండి: అద్వాయ్, పి రవిశంకర్, తిరుమల్ రెడ్డి టైటిల్ 'సుబ్రహ్మణ్య', ప్రీ-లుక్ పోస్టర్ స్పెల్‌బైండ్స్

# Billarangabaasha     # Kichchasudeep     # Vikrantrona    

trending

View More