ప్రభాస్‌తో హను రాఘవపూడి సినిమా.. పూజాకార్యక్రమాలతో ప్రారంభం

ప్రభాస్‌తో హను రాఘవపూడి సినిమా.. పూజాకార్యక్రమాలతో ప్రారంభం

4 months ago | 52 Views

వరుస విజయాలతో జోష్‌ విూదున్న ప్రభాస్‌ తర్వాత సినిమాను ప్రారంభించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఆయన హీరోగా రానున్న సినిమా మొదలైంది.  పూజా కార్యక్రమాలతో దీన్ని ప్రారంభించారు. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌ ఓ పోస్ట్‌ పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను అభిమానులు షేర్‌ చేస్తున్నారు.  ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు. పూర్తిస్థాయి పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఇది రానుంది. ఇప్పటికే విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ చిత్రం కోసం మూడు పాటలు కూడా కంపోజ్‌ చేసినట్లు హను రాఘవపూడి  ఓ సందర్భంలో తెలిపారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఇది తెరకెక్కనుంది. తాజాగా దీనికి సంబంధించిన టైటిల్‌ కూడా సోషల్‌ విూడియాలో వైరల్‌గా మారింది.

ఈ చిత్రానికి 'ఫౌజీ’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్‌ను  తీసుకుంటున్నట్లు వచ్చిన రూమర్స్‌ను ఆమె ఇటీవలే ఖండించారు.  'విూ ఊహాగానాలకు ఫుల్‌స్టాప్‌ పెడుతున్నందుకు క్షమించండి. నేను ఈ ప్రాజెక్ట్‌లో లేను’ అని పేర్కొన్నారు. దీంతో రూమర్‌కు చెక్‌ పడింది.   మరి ఇందులో ప్రభాస్‌ సరసన ఎవరు కనిపిస్తారో అని ఆయన అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇంకా చదవండి: టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన రజిషా విజయన్‌!

# Prabhas     # HanuRaghavapudi    

trending

View More