సల్మాన్‌ అభిమానులను గుడ్‌న్యూస్‌.. 27న 'సికిందర్‌' టీజర్‌ రిలీజ్‌!

సల్మాన్‌ అభిమానులను గుడ్‌న్యూస్‌.. 27న 'సికిందర్‌' టీజర్‌ రిలీజ్‌!

13 hours ago | 5 Views

బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘సికందర్‌’. కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగదాస్‌  దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా  ప్రపంచవ్యాప్తంగా 2025 ఈద్‌ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుండగా.. విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది. కాగా అప్‌డేట్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌ కోసం అదిరిపోయే వార్త ఒకటి బయటకు వచ్చింది. 'సికిందర్‌' టీజర్‌ టైం రానే వచ్చింది. సల్మాన్‌ఖాన్‌ బర్త్‌ డే సందర్భంగా డిసెంబర్‌ 27న 'సికిందర్‌' టీజర్‌ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.

ఇంకేంటి మరి సల్లూభాయ్‌ అభిమానులు డబుల్‌ సెలబ్రేషన్స్‌కు రెడీగా ఉండండి. ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా.. కాజల్‌ అగర్వాల్‌ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని నడియాద్వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై సాజిద్‌ నడియాద్వాలా నిర్మిస్తుండగా.. పాపులర్‌ యాక్టర్‌ సత్యరాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సమాజంలోని అవినీతి, నేరాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి కథ నేపథ్యంలో మురుగదాస్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని బీటౌన్‌ సర్కిల్‌ ఇన్‌సైడ్‌ టాక్‌. ఓ వైపు ఎమోషన్స్‌ను హైలెట్‌ చేస్తూనే.. మరోవైపు అభిమానులకు గూస్‌ బంప్స్‌ తెప్పించే హై ఆక్టేన్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉండబోతున్నాయట.

ఇంకా చదవండి: అత్యంత ఘనంగా నాగన్న మూవీ ట్రైలర్ విడుదల

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# సికిందర్‌     # సల్మాన్‌ ఖాన్‌     # బాలీవుడ్‌    

trending

View More