జ‌న‌వ‌రి 2న విడుదల కానున్న గ్లోబ‌ల్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ ‘గేమ్ ఛేంజ‌ర్‌’ ట్రైల‌ర్!

జ‌న‌వ‌రి 2న విడుదల కానున్న గ్లోబ‌ల్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ ‘గేమ్ ఛేంజ‌ర్‌’ ట్రైల‌ర్!

2 days ago | 5 Views

గ్లోబ‌ల్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ భారీ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజ‌ర్‌’కి కౌంట్ డౌన్ షురూ అయ్యింది. మాస్ట‌ర్ ఫిల్మ్ మేక‌ర్ శంక‌ర్ ఈ పొలిటిక‌ల్ యాక్ష‌న్ డ్రామాను తెర‌కెక్కించారు. సినిమాపై అంచ‌నాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. మెగాభిమానులు, ప్రేక్ష‌కులు సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా! అని ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు. ఈ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లే కార్య‌క్ర‌మానికి చిత్ర యూనిట్ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా జ‌న‌వ‌రి 2న ‘గేమ్ ఛేంజ‌ర్‌’ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి న్యూ ఇయ‌ర్ ట్రీట్‌ను అందించ‌టానికి సిద్ధ‌మైంది. 

ఇప్ప‌టి వ‌ర‌కు ‘గేమ్ ఛేంజ‌ర్‌’ నుంచి వ‌చ్చిన సాంగ్స్‌, టీజ‌ర్‌, పోస్ట‌ర్స్‌, ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో ఎక్స్‌పెక్టేష‌న్స్ పీక్స్‌కి చేరుకున్నాయి. ఇప్పుడు ట్రైల‌ర్ కోసం అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ప్ర‌పంచంలో గ్లోబ‌ల్ స్టార్ ఎలా ఉంటాడో చూడాల‌ని అంద‌రూ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్ అంచ‌నాల‌ను అందుకుని ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. 

 గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. గేమ్ ఛేంజ‌ర్‌ చిత్రంలో రెండు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టించగా, అంజ‌లి, ఎస్‌.జె.సూర్య‌, శ్రీకాంత్‌, సముద్ర‌ఖ‌ని, సునీల్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు.  ఎస్‌.యు.వెంక‌టేశ‌న్‌, వివేక్ రైట‌ర్స్‌గా వ‌ర్క్ చేశారు. హ‌ర్షిత్ స‌హ నిర్మాత‌. ఎస్‌.తిరుణ్ణావుక్క‌ర‌సు సినిమాటోగ్ర‌ఫీ, ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా సాయి మాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాశారు. న‌ర‌సింహా రావు.ఎన్, ఎస్‌.కె.జ‌బీర్‌ లైన్ ప్రొడ్యూస‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా అవినాష్ కొల్ల‌, యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్‌గా అన్బ‌రివు, డాన్స్ డైరెక్ట‌ర్‌గా ప్ర‌భుదేవా, గ‌ణేష్ ఆచార్య‌, ప్రేమ్ రక్షిత్‌, బాస్కో మార్టిస్, జానీ, శాండీ వ‌ర్క్ చేస్తున్నారు. రామ్ జోగ‌య్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్‌, కాసర్ల శ్యామ్ పాట‌ల‌ను రాశారు.

గేమ్ ఛేంజ‌ర్‌ను  శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ చిత్రాన్ని 

ఎస్‌వీసీ, ఆదిత్య‌రామ్ మూవీస్ సంస్థ‌లు త‌మిళంలో విడుద‌ల చేస్తుండగా హిందీలో ఏఏ ఫిలిమ్స్ అనిల్ తడాని రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సరిగమ ఆడియో పార్టనర్స్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇంకా చదవండి: రూ.3.11 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న "డ్రింకర్ సాయి" మూవీ

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# గేమ్ ఛేంజ‌ర్‌     # రామ్ చరణ్     # కియారా అద్వానీ     # అంజ‌లి    

related

View More
View More

trending

View More