సరిపోదా శనివారం ఓటీటీ కు సిద్ధం! ఈ సినిమాను ఎక్కడ చూడాలంటే....

సరిపోదా శనివారం ఓటీటీ కు సిద్ధం! ఈ సినిమాను ఎక్కడ చూడాలంటే....

3 months ago | 53 Views

నాని, ప్రియాంక మోహన్ నటించిన సరిపోద శనివారం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమా ఆగస్టు 29వ తేదీన గురువారం విడుదల అయ్యి, కలెక్షన్ కింగ్ గ మారింది. మరియు ఈ సినిమాకి అన్ని చోట్లో మంచి రివ్యూ రావడంతో సినిమా బృందం వారు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఈ చిత్రం యొక్క ఓటీటీ రైట్స్ కూడా తెలిసిపోయింది.  


తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఈ సినిమాను నెట్ఫ్లిక్ వేదికగా విడుదల చెయ్యనున్నారు. మరియు నాని నటించిన "సరిపోదా శనివారం" అను ఈ చిత్రం అక్టోబర్ 4, 2024 నుంచి ఓటీటీ లో స్ట్రీమ్ కానున్నది అని సమాచారం. కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఓటీటీ రైట్స్‌ డీల్‌తో నిర్మాత డీవీవీ దానయ్య, ఈ సినిమా బడ్జెట్‌లో సగం ఇప్పటికే రికవరీ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా ఫ్లాప్ అయి ఉంటే, విడుదల తేదీ నుండి ఒక నెలలోపు విడుదల చేయాలని మేకర్స్ నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం చేసుకున్నారు. కానీ సరిపోద శనివారం హిట్ టాక్ రావడంతో ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సిందే.  

నాని తన వరుస మూడు చిత్రాలైన దసరా, హాయ్ నాన్న, మరియు ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాలు హిట్ అవడంతో హ్యాట్రిక్ ను కొట్టాడు. మెయిన్ విలన్‌గా నటించిన ఎస్‌జే సూర్య, తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మేపించాడు. జేక్స్ బిజోయ్ అందించిన సంగీతం, ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ గ మారింది అనే చెప్పచు. 

ఇంకా చదవండి: "కానిస్టేబుల్" మోషన్ పోస్టర్ విడుదల

# SaripodhaaSanivaaram     # Nani     # PriyankaArulMohan     # OTT     # Netflix    

trending

View More