సంక్రాంతికి మారిన 'గేమ్‌ఛేంజర్'..డిసెంబర్‌పై కన్నేసిన పలు సినిమాలు!
2 months ago | 5 Views
సినిమాల విడుదలకు పండుగలే మెయిన్ టార్గెట్. సంవత్సరం సెకెండాఫ్‌లో దసరా, దీపావళి ముఖ్య పండుగలు. వాటిని టార్గెట్ చేసుకుని మేకర్స్ సినిమాల విడుదల ప్లాన్ చేసుకుంటారు. ఈ రెండు పండుగల తర్వాత ఓ మాదిరి చిత్రాలు విడుదలవుతాయి కానీ పెద్ద చిత్రాలను విడుదల చేయడానికి అంతగా ఆసక్తి చూపించరు. ఇకపోతే జనవరి ప్రారంభం, సంక్రాంతికి సినిమాలను భారీగా ప్లాన్ చేస్తారు. అందుకు భిన్నంగా ఇప్పుడు పరిస్థితి ఉంది. డిసెంబరులోనూ పెద్ద సినిమాలు క్యూ కడుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌లో క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. ముఖ్యంగా డిసెంబరుపై చాలా సినిమాల గురి ఉంది. డిసెంబరు 6న 'పుష్ష 2’ విడుదలకు సిద్ధమైంది. 20న 'గేమ్ ఛేంజర్’ విడుదల అనుకున్నారు. కానీ వాయిదా పడింది. ఆ చిత్రం సంక్రాంతి బరిలో ఉంది.
అలా 'గేమ్ ఛేంజర్' వాయిదా పడింది. ఆ డేట్ పై మిగిలిన నిర్మాతలు కన్నేశారు. నాగచైతన్య 'తండేల్’ని డిసెంబరు 20న విడుదల చేయాలన్నది ఓ ప్లాన్. అయితే దీనిపై అల్లు అరవింద్ ఇంకా సరైన నిర్ణయం తీసుకోలేదు. డిసెంబరు 20న నితిన్ 'రాబిన్ హుడ్’ విడుదల చేసే ఆలోచనలో ఉంది చిత్రబృందం. ఇంద్రగంటి మోహనకృష్ణ, పియదర్శి కాంబినేషన్‌లో'సారంగపాణి’ అనే ఓ సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమాను డిసెంబరు 20న విడుదల చేయాలని చూస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా ఇదే డేట్‌ని ఫిక్స్ చేసింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'మ్యాజిక్’ అనే సినిమా రూపుదిద్దుకొంది. డిసెంబరు 21న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని చిత్రబృందం ప్రకటించేసింది. అంతే కాదు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప’ను డిసెంబరు 20 లేదా 21న విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నారు. ఆగస్టు 15, వినాయక చవితి, దసరాకి చాలా సినిమాలే విడుదలయ్యాయి. అయితే ఏదీ ఆశించిన రీతిలో వసూళ్లు తీసుకురా లేకపోయాయి. మళ్లీ దీపావళికి సినిమాలు వరుస కట్టాయి. డిసెంబర్‌లో క్రిస్మస్‌కు ముందు కూడా ఇలాంటి వాతావరణమే కనిపించబోతోంది. సోలోగా రావడం కంటే ఇలా పోటీ మధ్యలో వస్తేనే కిక్ ఉంటుందని నిర్మాతలు భావిస్తున్నట్లు పరిస్థితి కనిపిస్తోంది.
ఇంకా చదవండి: జీ5లో అక్టోబర్ 25న స్ట్రీమింగ్ కాబోతోన్న ‘ఐందామ్ వేదం’.. ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# GamGamGanesha # Tandel # Kannappa