గూఢాచారి సీక్వెల్‌గా జి2
4 months ago | 42 Views
టాలీవుడ్ హిస్టరీలో ల్యాండ్ మార్క్‌గా నిలిచిపోయే సినిమాల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది గూడఛారి. అడివిశేష్ టైటిల్ రోల్ పోషించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే ప్రాంఛైజీలో ఈ చిత్రానికి కొనసాగింపుగా జీ2కూడా వస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మేజర్ సినిమాకు ఎడిటర్‌గా పనిచేసిన వినయ్ కుమార్ సిరిగినీడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా గన్స్ యాక్షన్ మూడ్‌లోకి దిగితే.. అంటూ డైరెక్టర్ వినయ్ కుమార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మేకర్స్. వినయ్ కుమార్ చేతిలో పిస్తోల్ పట్టుకున్న తాజా స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఇప్పటికే విడుదల చేసిన జీ2 (ఉ2) ఫస్ట్ లుక్ పోస్టర్‌తోపాటు ప్రీ వెర్షన్ అనౌన్స్ మెంట్ వీడియో సినిమాపై సూపర్ క్యూరియాసిటీ పెంచుతోంది. షూటింగ్ కొనసాగుతున్నట్టు తెలియజేశారు. అడివి శేష్ ఈ మూవీలో మరోసారి స్టైలిష్ యాక్షన్ అవతార్‌లో కనిపించబోతున్నట్టు ప్రీ వెర్షన్ అనౌన్స్ మెంట్ వీడియోతో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. పీపుల్ విూడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా జీ2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. జీ2 తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ విడుదల కానుంది.
ఇంకా చదవండి: జంధ్యాల మార్క్..'మారుతీనగర్ సుబ్రమణ్యం'
# Goodachari2 # AdiviSesh # BanitaSandhu