ఎట్టకేలకు ఎమర్జెన్సీ విడుదల ఖరారు!

ఎట్టకేలకు ఎమర్జెన్సీ విడుదల ఖరారు!

1 month ago | 5 Views

బాలీవుడ్‌ క్వీన్‌, మండి ఎంపీ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. 1975-77 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో కంగనా రనౌత్‌.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను పోషించింది. ఆమె దర్శకురాలు కూడా. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం.. పలు వివాదాల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే, ఎట్టకేలకు తాజాగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.

ఈ మేరకు ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 17న ‘ఎమర్జెన్సీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడిరచింది. ఈ విషయాన్ని కంగనా రనౌత్‌ స్వయంగా ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. ‘భారత దేశంలో శక్తిమంతమైన మహిళ చరిత్ర, దేశ విధిని మార్చిన క్షణాలు వచ్చే ఏడాది జనవరి 17న మీ ముందుకు రాబోతున్నాయి’ అంటూ పేర్కొన్నారు.

ఇంకా చదవండి: 'ఉద్వేగం' ట్రైలర్ విడుదల: నవంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రానున్నది

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# ఎమర్జెన్సీ     # కంగనా రనౌత్‌    

trending

View More