ప్రీ ఇండిపెండెన్స్‌ స్టోరీగా ఫౌజీ

ప్రీ ఇండిపెండెన్స్‌ స్టోరీగా ఫౌజీ

2 months ago | 5 Views

ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి  దర్శకత్వంలో  రూపొందనున్న చిత్రానికి 'ఫౌజీ’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు.  ఈ సినిమాలో ప్రభాస్‌ సైనికుడిగా నటిస్తున్నాడు. అందుకే ఈ టైటిల్‌ పెడితే బాగుంటుందని చిత్ర బృందం భావిస్తోందట. ప్రస్తుతానికి ఇదే ఈ సినిమా వర్కింగ్‌ టైటిల్‌. దీనికంటే మంచి టైటిల్‌ ఆలోచన వస్తే.. దాన్నే ఫిక్స్‌ చేస్తారట. లేదా 'ఫౌజీ’ టైటిల్‌నే ఖరారు చేస్తారట. 1947 కంటే ముందు సాగే కథ ఇది. ప్రభాస్‌ బ్రిటీష్‌ సైన్యంలో ఓ సోల్జర్‌గా కనిపించనున్నాడు. అయితే ఇప్పటికే వరుసగా మూడు, నాలుగు సినిమాల షూటింగ్స్‌ తో ప్రభాస్‌ బిజీబిజీగా గడుపుతున్నారు. మరోవైపు 'ఫౌజీ’  సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభమవడంతో ఈ సినిమా నుంచి ఓ అప్డేట్‌ అందింది. ప్రభాస్‌ బర్త్‌ డే సందర్భంగా ఆ ట్రీట్‌ రివీల్‌ చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ 'రాజా సాబ్‌’, 'ఫౌజి’, 'సలార్‌ 2’, ;కల్కి 2’, ;స్పిరిట్‌’ సినిమాల్లో నటిస్తున్నారు.

మొదటగా వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ కానున్న మారుతీ చిత్రం 'ది రాజా సాబ్‌’ షూటింగ్‌ లో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే మొదలుపెట్టిన హను రాఘవపూడి 'ఫౌజీ’  సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం ప్రభాస్‌ డేట్స్‌ లేకపోవడంతో డైరెక్టర్‌ మొదటి షెడ్యూల్‌లో ఇతర సీన్స్‌ చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ నెల 23న బర్త్‌ డే అనంతరం ప్రభాస్‌ 'ఫౌజీ’ షూటింగ్‌లోకి ఎంటర్‌ కానున్నడని సమాచారం. అలాగే 2, 3 వారాలు 'ఫౌజీ’ సినిమాకే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభాస్‌ అభిమానులకు భారీ ట్రీట్‌ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న కొత్త సినిమాల అప్‌డేట్‌లతోపాటు ఆయన గత చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించడానికి మేకర్స్‌ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రభాస్‌ నటించిన అరడజనకు పైగా సినిమాలు రీ రిలీజ్‌ చేయనున్నారు. 'మిస్టర్‌ పర్ఫెక్ట్‌', 'మిర్చి', 'ఛత్రపతి', 'ఈశ్వర్‌', 'రెబల్‌', 'సలార్‌' చిత్రాలు రిలీజ్‌ కానున్నాయి.

ఇంకా చదవండి: హనుమంతుడిగా రిషబ్‌ షెట్టి?.. 'జై హనుమాన్‌'పై ఊహాగానాలు!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# Fauji     # Prabhas     # ImanEsmail    

trending

View More