'పుష్ప`2 కోసం శరవేగంగా షూటింగ్‌

'పుష్ప`2 కోసం శరవేగంగా షూటింగ్‌

2 months ago | 5 Views

మూడేళ్ళుగా అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం 'పుష్ప 2'. అనేక కారణాల వల్ల ఈ సినిమా షూట్‌ ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ క్రమంలో సినిమా రిలీజ్‌ డేట్‌ కూడా రెండు మూడు సార్లు మార్చారు. అందరి అభిమాన స్టార్‌ హీరోల నుండి సినిమాలు వస్తున్న బన్నీ ఫ్యాన్స్‌ కళ్ళు మాత్రం కాయలు కట్టాయి. ఈ నేపథ్యంలోనే దర్శకుడు సుకుమార్‌ సినిమాని జెట్‌ స్పీడ్‌లో ముందుకు తీసుకెళ్తున్నాడు. ఓ వైపు గ్లిమ్ప్స్‌, సాంగ్స్‌ అప్డేట్స్‌కి మంచి ఆదరణ లభించగా.. మరో రెండు వండర్‌ ఫుల్‌ అప్డేట్స్‌ ఫ్యాన్స్‌లో జోష్‌ పెంచుతున్నాయి. పుష్ప మేకర్స్‌ ఇప్పటికే ఈ సినిమాని డిసెంబర్‌ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో షూటింగ్‌ లో వేగం పెంచిన దర్శకుడు సుకుమార్‌.. ఫస్ట్‌ హాఫ్‌ ఎడిట్‌ కాపీని లాక్‌ చేశారట. ఇక సెకండ్‌ హాఫ్‌ లో మిగిలి ఉన్న కొన్ని సన్నివేశాల షూట్‌ కోసం మూడు యూనిట్లు పనిచేస్తున్నాయి. ఇందులో ఒక యూనిట్‌ రంపచోడవరంలో పని చేస్తుండగా మరో రెండు యూనిట్లు వైజాగ్‌, యానాంలో పని చేస్తున్నాయి.

ఎట్టకేలకు సినిమా రిలీజ్‌ దగ్గరపడటం, షూటింగ్‌ చకచకా సాగుతుండటం అభిమానులలో జోష్‌ పెంచింది. 'పుష్ప 1'లో ఉన్న క్యారెక్టర్లనే ఈ సినిమాలో కొనసాగిస్తుండగా జగపతి బాబు అడిషినల్‌గా యాడ్‌ అయ్యారు. ఇక సినిమాలో ఒక ప్రత్యేకమైన ఐటమ్‌ సాంగ్‌ కోసం మొదట శ్రీలీలను సంప్రదించిన దిశా పటానిని ఓకే చేశారు. అయితే ఈ సినిమాలోని ఒక  పోస్టర్‌ విషయానికొస్తే.. ఎర్ర చందనం వ్యాపారాన్ని చిటికెన వేలుపై నిలబెట్టి చేయడగలడని సూచనగా దాన్ని హైలైట్‌ చేస్తున్నట్టు వినిపిస్తోంది. సుకుమార్‌ తెరకెక్కించే ప్రతి సీన్‌కు ఓ లాజిక్‌, కొన్ని రిఫరెన్స్‌లు ఉంటాయి. 'రంగస్థలం’లో జగపతిబాబు పాత్రకు పామును రిఫరెన్స్‌గా తీసుకున్నారు. సినిమా ప్రారంభంలో పామును ఏ విధంగా అయితే కొట్టి చంపుతారో అలాగే జగపతిబాబుని కూడా అలాగే కొట్టి చంపినట్లు చూపించారు. మరి ఇప్పుడు అల్లు గోరును హైలైట్‌ చేయడం వెనుక ఏముందో సుకుమార్‌ చెబితేనే బాగుంటుంది.

ఇంకా చదవండి: కంటెంట్ బేస్డ్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ 'ఆహా'- సుహాస్ యూనిక్ మూవీ "గొర్రె పురాణం"ఆహాలో స్ట్రీమింగ్

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# Pushpa2     # Alluarjun     # Rashmikamandanna    

trending

View More