క్రేజీ ఎంటర్‌టైనర్ 'మత్తు వదలారా 2' నుంచి ఫరియా అబ్దుల్లా ఫస్ట్ లుక్ రిలీజ్
3 months ago | 48 Views
శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్ లో రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ హిట్ మూవీ 'మత్తు వదలరా'. ఇప్పుడు అదే క్రియేటివ్ టీమ్ సీక్వెల్ 'మత్తు వదలారా 2' తో ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయ్యారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 'మత్తు వదలారా2' లో హీరోయిన్ ఫారియా అబ్దుల్లా నిధి పాత్రలో కనిపించనున్నారు. ఈ రోజు మేకర్స్ ఫరియా అబ్దుల్లా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. గన్ పట్టుకొని ఇంటెన్స్ లుక్ లో చూస్తున్న ఫారియా యాక్షన్ పోస్టర్ అదిరిపోయింది.
ఈ చిత్రంలో సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రతి పాత్ర కీలకంగా ఉండబోతోంది. ప్రముఖ నటులు చేరడంతో ఎంటర్ టైన్మెంట్ నెక్స్ట్ లెవల్ లో వుండబోతోంది. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తుండగా, సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్. మత్తు వదలారా 2 సెప్టెంబర్ 13న గ్రాండ్ గా విడుదల కానుంది. తారాగణం: శ్రీ సింహ కోడూరి, సత్య, ఫరియా అబ్దుల్లా, సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్.
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రితేష్ రానా
బ్యానర్లు: క్లాప్ ఎంటర్టైన్మెంట్ & మైత్రి మూవీ మేకర్స్
నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ) & హేమలత
సంగీతం: కాల భైరవ
డిఓపి: సురేష్ సారంగం
సహ రచయిత: తేజ ఆర్
Asst. రైటర్: సాయి సోమయాజులు
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్
యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్‌చున్ అంజి
లిరిసిస్ట్: ఫరియా అబ్దుల్లా
Vfx సూపర్‌వైజర్: జూలూరి అనిల్ కుమార్
మోషన్ గ్రాఫిక్స్/విజువల్ ఎఫెక్ట్స్: ARK WRX
స్టిల్స్: నిఖిల్ YHS
పబ్లిసిటీ డిజైన్స్: శ్యామ్ పాలపర్తి
మేకప్ చీఫ్: కొండా రమేష్
మార్కెటింగ్: ఫస్ట్ షో
పబ్లిసిటీ: బాబా సాయి కుమార్ మామిడిపల్లి
పీఆర్వో: వంశీ - శేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్: తేజ ఆర్
ఇంకా చదవండి: క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌లో గేమ్‌ఛేంజర్
# MathuVadalara2 # Sunil # FariaAbdullah # Satya