నాని 'సరిపోదా శనివారం'పై ఉత్కంఠ!
5 months ago | 56 Views
స్టార్ హీరో నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'సరిపోదా శనివారం’ . నాని 31గా వస్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎస్‌జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బ్జడెట్, భారీ కాన్వాస్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ చిత్రం ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఎస్‌జే సూర్య పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ఆయనకు బర్త్‌డే విషెస్ తెలుపుతూ.. స్పెషల్ వీడియో విడుదల చేశారు. అప్పట్లో నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు ప్రజల్ని బాగా హింసించేవాడు. అందుకే వాడిని వధించడానికి శ్రీ కృష్ణుడు సత్యభామతో కలిసి వెళతాడు. అంటూ హ్యాపి బర్త్ డే సర్ అంటూ విషెస్ తెలిపారు.
ఇక ఈ సినిమాలో ఎస్‌జే సూర్య ఓ క్రూరమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. తన అరాచకాల్ని హీరో(నాని) హీరోయిన్‌తో కలిసి ఎలా ఎదిరించాడన్నది సినిమా కాన్సెప్ట్. యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రంలో సాయికుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక 'అంటే సుందరానికి’ సినిమా తర్వాత నాని ` వివేక్ కాంబో రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇంకా చదవండి: శ్రీవారిని దర్శించుకున్న శ్రీకాంత్ కుటుంబం
# Saripodhaa Sanivaaram # Nani # August29