ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న 'ఈసారైనా' టీమ్.. దక్షిణాది భాషల్లో నవంబర్ 8 న ఘనంగా విడుదల కానుంది
1 month ago | 5 Views
విప్లవ్ దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ సినిమా 'ఈసారైనా'. ఈ సినిమా కథ అందమైన గ్రామీణ నేపధ్యంలో సాగుతుంది. ఒక నిరుద్యోగ యువకుడు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతూ అతని ప్రేమను వెతుక్కునే దిశగా ఎలా సాగుతాడు అనేది ఈ సినిమా కథ. ఈ సినిమాకి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. చిత్రం లో పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.
హీరో విప్లవ్ మాట్లాడుతూ, "ఈ సినిమా మీ అందరి ముందుకు రానున్నందుకు కారణం సంకీర్త్ అన్న. ఆయన ముందు నుంచి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసారు. ఈ సినిమా కి నేనే ప్రొడ్యూసర్ ని. అన్నిటినీ కష్టమైనా మేనేజ్ చేశాను. టీజర్, సాంగ్స్ అన్నీ చూడండి. నచ్చితే, సినిమా చూడండి" అన్నారు.
హీరోయిన్ అశ్విని మాట్లాడుతూ, "శిరీష క్యారెక్టర్ నాతో చేయించిన విప్లవ్ కి తాంక్స్. ఈ సినిమా కి షూటింగ్ చేస్తున్న రోజులు సమ్మర్ హాలిడేస్ లాగ అనిపించింది. నా ఫస్ట్ సినిమా కి ఇలాంటి క్యారెక్టర్ రావడం సంతోషంగా ఉంది. ఇది సినిమా మాత్రం కాదు, ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు." అన్నారు.
చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ మాట్లాడుతూ, "విప్లవ్ అన్న నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థాంక్స్. సలార్ తర్వాత నాకు క్యారెక్టర్ చెప్పగానే, నాకు నచ్చేసింది. ఈ రోజు ప్రివ్యూ లో చూసాక అనిపించినా విషయం ఏంటి అంటే, అన్ని సీన్స్ చాలా ప్లెజంట్ గా అనిపించాయి." అన్నారు.
కో ప్రొడ్యూసర్ సంకీర్త్ మాట్లాడుతూ, "ఇక్కడకు వచ్చినందుకు అందరికీ చాలా థాంక్స్. నా దృష్టి లో చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమి ఉండదు. నా దృష్టి లో ఒక సినిమా మనతో పాటు ఇంటికి వచ్చిందంటే, అది అందరికీ నచుతుంది. ఈ సినిమా లో కూడా అందరూ ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. నవంబర్ 8 న థియేటర్స్ లో ఈ సినిమా చూడొచ్చు." అన్నారు.
నటుడు మెహబూబ్ బాషా మాట్లాడుతూ, "ఈ సినిమా ని నేను లాస్ట్ ఇయర్ చేశాను. ఈ సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు. ఈ సినిమా లో పెద్ద సెటప్ ఏమి ఉండదు కానీ విప్లవ్, సంకీర్త్ అందరూ బాగా కష్టపడ్డారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అనిపిస్తుంది. నవంబర్ 8 న ఈ సినిమా ని థియేటర్స్ లో చూడొచ్చు." అన్నారు.
నటుడు ప్రదీప్ రాపర్తి మాట్లాడుతూ, "ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు విప్లవ్ గారికి, నిర్మాత గారికి, మెయిన్ లీడ్ కి తాంక్స్. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అని నమ్మకం ఉంది" అన్నారు.
సంకీర్త్ కొండ సహ-నిర్మాత గా వ్యవహరిస్తున్న ఈ సినిమా లో అశ్విని అయలూరు ప్రధాన నటిగా నటించారు. ఈ సినిమా నవంబర్ 8 న విడుదల కానుంది.
నటీనటులు : విప్లవ్, అశ్విని, ప్రదీప్ రాపర్తి, మహబూబ్ బాషా, కార్తికేయ దేవ్, నీతు క్వీన్, సత్తన్న, అశోక్ మూలవిరాట్
టెక్నీషియన్స్:
నిర్మాత: విప్లవ్
సహ నిర్మాత: సంకీర్త్ కొండా
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: విప్లవ్
సంగీతం: తేజ్
డి ఓ పి: గిరి
ఎడిటింగ్: విప్లవ్
కళ: దండు సందీప్ కుమార్
డి ఐ: మేయిన్ స్టూడియోస్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అభినయ్ కొండ
లైన్ ప్రొడ్యూసర్: పూర్ణిమ రెడ్డి
సాహిత్యం: గోరేటి వెంకన్న, రాకేందు మౌళి, శరత్ చేపూరి
గాయకులు: గోరేటి వెంకన్న, ఎల్ వి రేవంత్, పి వి ఎన్ ఎస్ రోహిత్, యశ్వంత్ నాగ్
పబ్లిసిటీ మరియు లిరికల్: బాబీ
పి ఆర్ ఓ : మధు VR
ఇంకా చదవండి: నవంబర్ 22న విడుదలకు సిద్దమైన "ఝాన్సీ ఐపీఎస్".