ఎంపురాన్‌ మూడో పార్ట్‌కు సిద్దం!

ఎంపురాన్‌ మూడో పార్ట్‌కు సిద్దం!

3 days ago | 5 Views

మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఎంపూరన్‌ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బద్దలు కొడుతూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా  నిలుస్తోంది. ఓ వైపు ఈ సినిమాను పలు వివాదాలు చుట్టు-ముడుతుండగా.. మరోవైపు మూడో పార్టుకు సంబంధించిన ఆసక్తికర వార్త వైరల్‌ అవుతోంది. పృథ్విరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్‌ లాల్‌ లీడ్‌ రోల్‌లో నటించగా.. పృథ్విరాజ్‌ సుకుమారన్‌, మంజు వారియర్‌ కీలక పాత్రలు పోషించారు. అతి త్వరలోనే పృథ్విరాజ్‌ సుకుమారన్‌ థర్డ్‌ పార్ట్‌ను మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నాడని..ఓ వార్త రౌండప్‌ చేస్తోంది. కాగా ఈ సారి థర్డ్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌లో మరో క్రేజీ యాక్టర్‌ ఉండబోతున్నాడట.

L2 Empuraan sequel L3's title revealed: Know all about the  Mohanlal-Prithviraj Sukumaran film - Hindustan Times

ఇంతకీ ఆ యాక్టర్‌ ఎవరో కాదు మోహన్‌ లాల్‌ కుమారుడు ప్రణవ్‌ మోహన్‌లాల్‌. ఈ కథాంశం తీవ్రంగా ఉంటుందని, అబ్రహం ఖురేషి అలియాస్‌ స్టీఫెన్‌ నేడుంపల్లి అలియాస్‌ లూసిఫర్‌ 1982 లో ముంబైకి వచ్చి తన మాఫియా సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ప్రయాణాన్ని ట్రాక్‌ చేసే నేపథ్యంలో  థర్డ్‌ పార్టు ఉండబోతుందంటూ కథనాలు తెరపైకి వస్తున్నాయి. దీనికి సంబంధించి రెండో పార్టు చివరలో లీడ్‌పై హింట్‌ కూడా ఇచ్చేశాడు డైరెక్టర్‌. ఈ సారి ర3లో వివాదాలను నివారించడానికి మేకర్స్‌ స్కిప్ట్‌ విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం

ఇంకా చదవండి:  మాలీవుడ్‌లో పోటాపోటీ .. 10 మమ్మట్టి మూవీకి పోటీగా బాసిల్‌ మూవీ

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# ఎంపురాన్‌     # మోహన్‌ లాల్‌    

trending

View More