సందీప్ రాజ్‌ షో రన్నర్‌గా న్యూ వెబ్ సిరీస్  'AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్'ని లాంచ్ చేసిన ETV విన్

సందీప్ రాజ్‌ షో రన్నర్‌గా న్యూ వెబ్ సిరీస్ 'AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్'ని లాంచ్ చేసిన ETV విన్

12 days ago | 12 Views

ETV విన్ తన లేటెస్ట్ వెబ్ సిరీస్ "AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్" అనౌన్స్‌మెంట్ తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. వెబ్ సిరిస్ ప్లాట్‌ఫారమ్‌లో పెరుగుతున్న ఆడియన్స్ ను ఆకట్టుకునేలా క్యాలిటీ కంటెంట్ కి ఇది ప్రామిస్ చేస్తోంది. సందీప్ రాజ్ షో రన్నర్ గా వున్న ఈ సిరిస్ కి జోసెఫ్ క్లింటన్ రైటర్, డైరెక్టర్. 

పూజా కార్యక్రమాలతో ప్రాజెక్ట్ అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. ఈ లాంచింగ్ ఈవెంట్ సిరీస్‌కు నాంది పలికింది. పరిశ్రమ నుంచి ప్రముఖులతో పాటు టీం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

నిర్మాత ఎఎస్కేఎన్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు, ఈ పోస్టర్ సిరీస్ కి ఒక ఇంట్రస్టింగ్ టోన్ ని సెట్ చేస్తుంది. "AIR: All India Rankers" ఫ్యాన్, డ్రామా అండ్ ఇంటెన్సిటీ వున్న సిరిస్ ని హింట్ ఇస్తోంది. 

"AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్" ఒక థ్రిల్లింగ్ వెంచర్‌గా రూపొందుతోంది, ఇది ప్రేక్షకులపై గుర్తిండిపోయే సిరిస్ కానుంది. స్ట్రాంగ్ క్రియేటివ్ టీం, ప్రముఖ నటీనటులుతో ఈ వెబ్ సిరిస్ ETV విన్ లైనప్‌కు ఒక ఒక ముఖ్యమైన ఎడిషన్. ఈ వెబ్ సిరిస్ ఎమోషన్, డ్రామా, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకులకు రోలర్ కోస్టర్ రైడ్ ఎక్స్ పీరియన్స్ ని అందించనుంది. 

నటీనటులు: హర్ష రోషన్, భాను ప్రతాప, జయతీర్థ, హర్ష చెముడు, సింధురెడ్డి

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: జోసెఫ్ క్లింటన్

ప్రెజెంటర్, షో రన్నర్: సందీప్ రాజ్

ప్రొడ్యూస్ బై పాకెట్ మనీ పిక్చర్స్

ఇంకా చదవండి: జూన్ 27న ఆహాలో న్యూ ఏజ్ ఫిల్మ్ ‘లవ్ మౌళి’ స్ట్రీమింగ్

# AIR:AllIndiaRankers     # SandeepRaj     # HarshRoshan     # TeluguCinema