'లక్కీ భాస్కర్'గా వస్తున్న దుల్కర్ సల్మాన్!
1 month ago | 5 Views
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం 'లక్కీభాస్కర్’. అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దుల్కర్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. తాజాగా ఆయన విూడియాతో మాట్లాడుతూ తన అనారోగ్యం వల్ల 'లక్కీభాస్కర్’ షూట్‌లో జాప్యమైందన్నారు. సినిమాల మధ్య గ్యాప్ ఎక్కువ తీసుకోవడం నాకు నచ్చదు. ఈ ఏడాది మరో రెండు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల ఒక సినిమా క్యాన్సిల్ అయింది. మరొకటి చివరి నిమిషంలో వర్క్‌వుట్ కాలేదు. నా అనారోగ్యం కారణంగా 'లక్కీభాస్కర్’ షూటింగ్ కూడా ఆలస్యమైంది. ఈ టీమ్ అంతా నాకు ఎంతో సపోర్ట్ చేసింది. దర్శకనిర్మాతల దగ్గర నుంచి లైట్‌మెన్ వరకు అందరూ నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు. 'షూటింగ్ ఆపేద్దాం.. ఇంటికి వెళ్లండి’ అని చెప్పేవారు. కానీ, అంత పెద్ద భారీ సెట్ వేసి చిత్రీకరణ చేస్తున్నప్పుడు నా కోసం అది ఆగిపోకూడదు కదా.. అందుకే ఎంత నొప్పిగా ఉన్నా షూటింగ్‌లో పాల్గొన్నా' అని దుల్కర్ చెప్పారు.
ఈ విషయంపై వెంకీ అట్లూరి మాట్లాడుతూ..'సాధారణంగా నటీనటులు 10 గంటలు పని చేయగలరు. కానీ, దుల్కర్ ఒక్కోరోజు 15 గంటల దాకా వర్క్ చేశారు. ఆయన బాధ చూసి మేము ఇబ్బంది పెడుతున్నామేమో అనిపించింది. షూటింగ్ కంటే ఆరోగ్యం ముఖ్యమని ఎన్నోసార్లు చెప్పాం. అయినా వినలేదు. సినిమాపై దుల్కర్‌కు ఉన్న అంకితభావం అలాంటిది. మేమంతా ఒకే కుటుంబంలా ఉంటాం’ అని వివరించారు. 'లక్కీభాస్కర్’ విషయానికొస్తే.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో డ్రామా థ్రిల్లర్‌గా ఇది రూపొందింది. దుల్కర్ టైటిల్ రోల్‌లో కనిపించనుండగా.. విూనాక్షి చౌదరి , అయేషా ఖాన్ కీలకపాత్రల్లో నటించారు.
దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఈ చిత్రం విడుదల కానుంది. దీని గురించి నిర్మాత మాట్లాడుతూ.. బ్యాంకింగ్ నేపథ్యంలో కుటుంబ భావోద్వేగాలతో నడిచే ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందన్నారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది.
ఇంకా చదవండి: 31న వస్తున్న కిరణ్ అబ్బవరం 'క...' మూవీ