కర్రి బాలాజీ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్  ‘డర్టీ లవ్ ‘

కర్రి బాలాజీ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘డర్టీ లవ్ ‘

2 months ago | 5 Views

సమాజంలో పేరుకుపోతున్న ‘డర్టీ లవ్‘ ముసుగులో ప్రైవేట్  రూముల్లో శృంగారంతో, రేవ్  పార్టీల్లో విలాసాలతో , పబ్బుల్లో జల్సాలతో  యువత మత్తులో ఎలా తూగుతున్నారో తెలిపే చిత్ర కథతో A2B ప్రొడక్షన్స్  నిర్మాణ సంస్థ  ‘డర్టీ లవ్ ‘ చిత్రం రూపొందించనుంది. ఇంతకుముందు  ‘అన్ స్టాపబుల్’ అనే నాన్ స్టాప్ కామెడీ ఎంటర్టైనర్  తీసిన నిర్మాత  రంజిత్ రావు , తన తదుపరి చిత్రాన్ని ‘బ్యాక్ డోర్’ అనే సందేశ్మాతక చిత్రాన్ని తీసిన దర్శకుడు, నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ  దర్శకత్వంలో ‘డర్టీ లవ్ ‘ అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.


ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయ్యింది.  ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఈ చిత్రానికి కొత్త కథానాయకుడు, నాయికల కోసం అన్వేషిస్తున్నారు.  ప్రముఖ నటీ నటులు,  సాంకేతిక నిపుణులుతో తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ త్వరలో మొదలవుతుంది.

ఇంకా చదవండి: "వీక్షణం" సినిమా ప్రీమియర్ షోలకు అదిరే రెస్పాన్స్

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# DirtyLove     # KarriBalaji     # RanjithRao    

trending

View More