విశ్వక్‌సేన్‌ చిత్రానికి దర్శకేంద్రుడి క్లాప్‌

విశ్వక్‌సేన్‌ చిత్రానికి దర్శకేంద్రుడి క్లాప్‌

2 days ago | 11 Views

ఈ ఏడాది గామి, 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమాలతో హిట్లు అందుకున్న మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌  ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ఇక విశ్వక్‌ నటిస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటి 12. లైలా అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు రామ్‌ నారాయణ్‌ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రం నేడు అధికారికంగా పూజ కార్యక్రామలు పూర్తి చేసుకుంది. ఈ వేడుకకు.. దర్శక దిగ్గజం కే రాఘవేంద్ర రావు ముఖ్య అతిథిగా వచ్చి ముహూర్తం క్లాప్‌ కొట్టగా.. హరీష్‌ శంకర్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేసాడు. ఇక ఈ సినిమాలో విశ్వక్‌సేన్‌ లేడీ గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఈ సందర్భంగా మూవీ ఫస్ట్‌ లుక్‌ను మేకర్స్‌ లాంచ్‌ చేశారు. ఆకాంక్ష శర్మ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో కనిపించబోతుందని ఇన్‌సైడ్‌ టాక్‌. తనిష్క్‌ బాగ్చి మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందించగా.. రిచర్డ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నారు.

Laila: విశ్వక్ సేన్ 'లైలా' మూవీ ఓపెనింగ్ ఫొటోలు | Vishwaksen Starring Laila  Movie Opening Photos KBK

ఇంకా చదవండి: మిడిల్‌ క్లాస్‌ మహిళగా నివేదా థామస్‌!

# Laila     # VishwakSen     # RamNarayan     # TeluguCinema