గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో దర్శకుడు మోహన్ వడ్లపట్ల మూవీ 'M4M' హిందీ ట్రైలర్ విడుదల
1 month ago | 5 Views
▪️ దేశవిదేశ సినీప్రముఖుల సమక్షంలో వేడుక
▪️ తెలుగుతో పాటు 5 భాషల్లో తెరకెక్కిన M4M
▪️ హాలీవుడ్ రేంజ్‌లో సస్పెన్స్ థ్రిల్లర్
▪️ మోహన్ వడ్లపట్ల దర్శకనిర్మాణం
మూవీ మేకర్ మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన M4M (Motive For Murder) మూవీ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ఈ మూవీ హిందీ ట్రైలర్ ప్రతిష్టాత్మక గోవా ఇంటర్నెషనల్ ఫిలిం ఫెస్టివల్ (Goa IFFI)లో విడుదల కానుంది. ఈ నెల 23న సాయంత్రం 7 గంటలకు గోవా ఇంటర్నెషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో IMPPA ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, దేశ విదేశీయ సినీప్రముఖుల సమక్షంలో హిందీ ట్రైలర్ లాంచ్ చేయబోతోంది చిత్రయూనిట్.
ఈ సందర్భంగా ఈ మూవీ దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్ల మీడియాతో మాట్లాడుతూ.. M4M సబ్జెక్ట్ యూనివర్సల్ అని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీప్రేక్షకులు మా M4M మూవీని చూసి థ్రిల్ అవుతారని చెప్పారు. మోటివ్ ఫర్ మర్డర్ తెలిసినప్పుడు మైండ్స్ బ్లో అవుతాయని, అనూహ్యమైన సినిమాటిక్ ఎక్సపీరియన్స్ నేను మీ అందరికీ అందించబోతున్నాను అంటూ తెలిపారు. త్వరలోనే ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు తెలిపారు.
తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో తెరకెక్కింది ఈ సస్పెన్స్ థ్రిల్లర్. మునుపెన్నడూ ఎరుగని సైకొని ప్రేక్షకులు చూడబోతున్నారని, మర్డర్ మిస్టరీ ఒక సెన్సేషన్ కాబోతుందని ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఒడిశా సూపర్ స్టార్ సంబీట్ ఆచార్య, అమెరికన్ హీరోయిన్ జో శర్మ లకు ప్యాన్ ఇండియా స్కేల్ లో కొత్త అధ్యాయం మొదలవుతుందని చెబుతున్నారు.
బ్యానర్: మోహన్ మీడియా క్రియేషన్స్, In Association with McWin Group USA.
తారాగణం:
జో శర్మ (ప్రధాన నటి) (USA), సంబీత్ ఆచార్య (ప్రధాన నటుడు), శుభలేఖ సుధాకర్, సత్య కృష్ణ, MRC వడ్లపట్ల, పసునూరి శ్రీనివాస్
సాంకేతిక సిబ్బంది:
కథ: మోహన్ వడ్లపట్ల, రాహుల్ అడబాల, జో శర్మ
స్క్రీన్ ప్లే: మోహన్ వడ్లపట్ల, రాహుల్ ఆడబాల
దర్శకత్వం: మోహన్ వడ్లపట్ల
డైలాగ్స్: శ్రీచక్ర మల్లికార్జున
సంగీతం: వసంత్ ఇసాయిపెట్టై
DOP: సంతోష్ షానమోని
Stunts: యాక్షన్ మల్లి
ఎడిటింగ్: పవన్ ఆనంద్
Mixing: విష్ణు వర్ధన్ కాగిత, కార్తికేయ స్టూడియో
DI: రత్నాకర్ రెడ్డి, కలర్ లాజిక్స్
VFX/CG: కొత్తపల్లి ఆది, వెంకట్
సౌండ్ డిజైనర్: సాగర్
దర్శకత్వ శాఖ: రాహుల్ అడబాల, శ్రీచక్ర మల్లికార్జున, హరి కిషన్, సుభాష్ సిరిపెల్లి, గోవింద్, రాజు, వెంకట్, వంశీ
PRO: పర్వతనేని రాంబాబు, కడలి రాంబాబు, దయ్యాల అశోక్
ఇంకా చదవండి: ప్రతికూల పరిస్థితులతో "ఫుట్ బాల్" ఆడే ప్రేమికుల కథ "డ్యూడ్"- మూడు భాషల్లో
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# గోవా ఫిల్మ్ ఫెస్టివల్ # M4Mమోటివ్ ఫర్ మర్డర్మో # హన్ వడ్లపట్ల