దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా జంటగా నటించిన 'ఉత్సవం' ట్రైలర్ రిలీజ్

దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా జంటగా నటించిన 'ఉత్సవం' ట్రైలర్ రిలీజ్

3 months ago | 61 Views

దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించిన తెలుగు డ్రామా 'ఉత్సవం'. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఈరోజు, మేకర్స్ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం చెప్పిన స్టేజ్ ప్లే లోని పవర్ ఫుల్ డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. థియేటర్ ప్లేస్ చుట్టూ సాగే నెరేటివ్ లో 'మన బ్రతుకులు కలలు కావు కళలని గుర్తించే రోజులు రావా'అని ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్ కథలోని ఎసెన్స్ ని ప్రజెంట్ చేసింది. కృష్ణ (దిలీప్ ప్రకాష్), రామ (రెజీనా కసాండ్రా) లవ్ స్టొరీ ఉత్సవంలో మరో ప్రధాన ఆకర్షణ. ఈ లవ్ స్టొరీ, కాన్ఫ్లిక్ట్ ట్రైలర్ లో చాలా ఇంట్రస్టింగ్ గా ప్రజెంట్ చేశారు.   


దర్శకుడు అర్జున్ సాయి థాట్-ప్రొవొకింగ్ కాన్సెప్ట్‌ని ఎంచుకోడం అభినందనీయం. ఎమోషన్స్, లవ్, ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులని కట్టిపడేశారు.

దిలీప్ ప్రకాష్ ఛాలెంజింగ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. తన స్క్రీన్ ప్రజెన్స్ చాలా ఎఫెక్టివ్ గా వుంది. ప్రకాష్ రాజ్ నటన మరో ఆకర్షణగా నిలిచింది. దిలీప్ లవ్ గా, థియేటర్ ప్లేస్ అంటే ఇష్టం వుండే అమ్మాయిగా రెజీనా కసాండ్రా ఆకట్టుకుంది. 

నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ కీలక పాత్రల్లో కనిపించారు. 

రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ సినిమా ఎసెన్స్ ని బ్రిలియంట్ గా ప్రజెంట్ చేసింది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ స్కోర్ నెరేటివ్ కి డెప్త్ ని యాడ్ చేసింది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌.

ఉత్సవం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. 

తారాగణం: దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ.

సాంకేతిక సిబ్బంది:

దర్శకత్వం: అర్జున్ సాయి

నిర్మాత: సురేష్ పాటిల్

సమర్పణ: హార్న్‌బిల్ పిక్చర్స్

సంగీతం: అనూప్ రూబెన్స్

సాహిత్యం: వనమాలి, భాస్కరభట్ల, అనంత శ్రీరామ్.

గాయకులు: అనురాగ్ కులకర్ణి, కైలాష్ ఖేర్, అర్మాన్ మాలిక్, విజయ్ ప్రకాష్, పెంచల్ దాస్/ రామ్ మిరియాల.

ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

డీవోపీ: రసూల్ ఎల్లోర్

డైలాగ్స్: రమణ, అర్జున్ సాయి 

DI & సౌండ్ మిక్స్: అన్నపూర్ణ స్టూడియోస్

పీఆర్వో: వంశీ & శేఖర్

మ్యూజిక్ లేబుల్: లహరి మ్యూజి

ఇంకా చదవండి: ఘనంగా "కావేరి" మూవీ సక్సెస్ మీట్

# Utsavam     # Dilipprakash     # Reginacassandra    

trending

View More