వైవిధ్యంగా 'క’మూవీ నిర్మాణం!
4 months ago | 37 Views
కిరణ్ అబ్బవరం నటించిన ’క’ సినిమా నుండి కొన్ని రోజుల క్రితం టీజర్ విడుదలైంది. ఆసక్తికరంగా వున్న ఈ టీజర్ చూశాక, సినిమా వైవిధ్యంగా ఉంటుందని తెలుస్తోంది. సుజిత్, సందీప్ లు ఇద్దరూ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సాయంత్రం మూడు గంటలు అవగానే ఆ గ్రామంలో చీకట్లు ముసురుకోవటం టీజర్ లో చూసాం. అలాగే కిరణ్ అబ్బవరం ఇందులో పోస్ట్ మేన్ గా కనిపిస్తాడు. ఒక వైవిధ్యమైన లుక్స్ తో ఈ సినిమాలో అతను వుండబోతున్నట్టుగా అర్థం అవుతోంది. అయితే ఈ టీజర్ లోనే ఒక డాగ్ ని కూడా చూస్తాము.
ఆ డాగ్ సినిమాలో ఒక భాగం అని చెపుతున్నాడు కిరణ్ అబ్బవరం. మామూలుగా అయితే సినిమాలో కుక్కలు కావాలంటే ట్రైనింగ్ పొందిన డాగ్స్ ని తీసుకువస్తూ వుంటారు. కానీ ఈ సినిమాలో నటించిన డాగ్ మాత్రం అలా వచ్చింది కాదు. 'అది ఒక స్ట్రీట్ డాగ్ , దాన్ని తెచ్చి సుమారు 8 నెలలు నేనే ట్రైనింగ్ ఇచ్చాను. నా దగ్గర ఉండేట్టు చేసుకున్నాను, ఆ తరువాత కొన్ని నెలలు దానికి సరైన ఆహారం అది ఇచ్చి నా దగ్గర అది పూర్తిగా మచ్చిక అయ్యాక, పూర్తి ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు సినిమా చిత్రీకరణ కోసం దానితో పని చేశాం’ అని చెప్పారు కిరణ్ అబ్బవరం.
ప్రస్తుతం ఈ డాగ్ కిరణ్ అబ్బవరం ఇంట్లో వుంది. ఈ సినిమాలో సెకండ్ హైయెస్ట్ పైడ్ యాక్టర్ ఎవరైనా వున్నారు అంటే అది ఈ డాగ్ మాత్రమే అని సరదాగా చిత్ర యూనిట్ సభ్యులు అనుకుంటూ వుంటారు. ఎందుకంటే స్ట్రీట్ డాగ్ అయినా, దానికి మంచి ఆహారం, దాని బాగోగులు చూసేందుకు గాను చాలా ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఆ డాగ్ రోజూ మాంసాహారం లేకపోతే ముద్ద ముట్టదు అని తెలిసింది. అందుకని ఈ డాగ్ సెకండ్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ ఈ సినిమాలో అని అంటూ వుంటారు చిత్ర యూనిట్. సినిమాలో ఈ డాగ్ ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుంది అని కూడా తెలిసింది.
ఇంకా చదవండి: నాని 'సరిపోదా శనివారం'పై ఉత్కంఠ!
# Kiran Abbavaram # Telugu Cinema # Ka