రజనీ స్టైల్ కు భిన్నంగా 'వేట్టయాన్‌'... రోజురోజుకూ పెరుగుతున్న అంచనాలు!

రజనీ స్టైల్ కు భిన్నంగా 'వేట్టయాన్‌'... రోజురోజుకూ పెరుగుతున్న అంచనాలు!

3 months ago | 48 Views

అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ హీరోగా టి.జె.జ్ఞానవేల్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ’వేట్టయాన్‌’ అక్టోబర్‌ 10న ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తాజాగా దీనిపై సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ చిత్ర నేపథ్యం గురించి చెప్పారు. ఇప్పటికే రానా ఈ చిత్రంపై చేసిన కామెంట్స్‌ అంచనాలు పెంచగా.. తాజాగా అనిరుధ్‌ చేసిన వ్యాఖ్యలు వాటిని రెట్టింపు చేసి రజనీ ఫ్యాన్స్‌లో జోష్‌ నింపుతున్నాయి. 'వేట్టయాన్‌’ పవర్‌ఫుల్‌ కథతో రానుంది. దీని స్క్రిప్ట్‌ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రజనీ ఈ కథకు మరింత బలాన్నిచ్చారు. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు ఇందులో కొత్త రజనీకాంత్‌ను చూస్తారు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నిటికంటే ఇది వైవిధ్యంగా ఉంటుంది. 


సామాజిక అంశాలు, వాస్తవ సంఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. సూపర్‌ స్టార్‌ గత చిత్రం ’జైలర్‌’తో పోలిస్తే ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది’ అని అనిరుధ్‌ చెప్పారు. ఈ చిత్రం గురించి  గతంలో రానా మాట్లాడుతూ.. ఇది రజనీస్టైల్‌ సినిమా కాదని.. ఆయన ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన చిత్రాన్ని మొదటిసారి ఎంపిక చేసుకున్నారని తెలిపారు. దీంతో ప్రేక్షకుల్లో దీనిపై ఆసక్తి నెలకొంది.

ఈ సినిమా విషయానికొస్తే.. ’జై భీమ్‌’ విజయం తర్వాత టి.జె.జ్ఞానవేల్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమిది. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ కీలకపాత్రలు పోషించారు. దీనితో పాటు లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం ’కూలీ’లోనూ రజనీ నటిస్తున్నారు.

ఇంకా చదవండి: త్వరలోనే పట్టాలెక్కనున్న 'ధూమ్‌ 4’... కీలక పాత్రలో కనిపించనున్న సూర్య!


# Vettaiyan     # Thalaivar170     # Rajinikanth     # AmitabhBachchan     # ArjunSarja     # FahadhFaasil    

trending

View More