
మూడో షెడ్యూల్ పూర్తి చేసుకున్న డిఫరెంట్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ “కిల్లర్”
23 days ago | 5 Views
“శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ మరో సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ “కిల్లర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో పూర్వాజ్ హీరోగా నటిస్తుండగా, జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తోంది. విశాల్ రాజ్, గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. థింక్ సినిమా బ్యానర్ పై ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థలతో కలిసి పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు.
“కిల్లర్” పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మూడో షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం పాల్గొని, కీలకమైన యాక్షన్, రొమాంటిక్, థ్రిల్లింగ్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా లవ్, రొమాన్స్, రివేంజ్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలను అద్భుతంగా మిళితం చేస్తూ, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. సరికొత్త సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ గా “కిల్లర్” పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ సినిమా మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం టీమ్ త్వరలో రెడీ అవుతోంది. “కిల్లర్” కు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ త్వరలో వెల్లడించనున్నారు.
123
నటీనటులు - జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, విశాల్ రాజ్, చందూ, గౌతమ్, తదితరులు
టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ: జగదీశ్ బొమ్మిశెట్టి
మ్యూజిక్: అషీర్ ల్యూక్, సుమన్ జీవరత్నం
వీఎఫ్ఎక్స్ - వర్చువల్ ప్రొడక్షన్: మెర్జ్ ఎక్స్ ఆర్
పీఆర్ఓ: జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
బ్యానర్స్ - థింక్ సినిమా, మెర్జ్ ఎక్స్ ఆర్, ఏయు అండ్ ఐ
నిర్మాతలు - పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభ రెడ్డి
రచన, దర్శకత్వం - పూర్వాజ్
ఇంకా చదవండి: హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్, డైరెక్టర్ సంజీవ్ మేగోటి కాంబినేషన్ లో కొత్త చిత్రం
"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"