అల్లు అర్జున్‌తో సుకుమార్‌ గొడవ పడ్డారా?...  చిత్రం షూటింగ్‌ డిలేపై సర్వత్రా అనుమానాలు!

అల్లు అర్జున్‌తో సుకుమార్‌ గొడవ పడ్డారా?... చిత్రం షూటింగ్‌ డిలేపై సర్వత్రా అనుమానాలు!

5 months ago | 52 Views

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రాలలో 'పుష్ప' ఒకటి. బ్లాక్‌ బస్టర్‌ చిత్రం 'పుష్ప: ది రైజ్‌’ కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా భారీ బ్జడెట్‌తో తెరకెక్కుతుంది. టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి గత రెండు రోజులుగా ఒక వార్త సోషల్‌ విూడియాలో ఫుల్‌ వైరల్‌ అవుతుంది. దర్శకుడు సుకుమార్‌, అల్లు అర్జున్‌ల మధ్య ఉన్న రిలేషన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆర్య సినిమాతో మొదలైన ఈ జర్నీ ఇప్పటివరకు కొనసాగుతుంది. అయితే తాజాగా వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తుంది. 'పుష్ప-2' షూటింగ్‌ చివరి దశలో ఉన్న క్రమంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు.. 

దీంతో అల్లు అర్జున్‌ సుకుమార్‌ విూద ఉన్న కోపంతో తన గడ్డం తీసేసి ట్రిప్‌కు చెక్కేసారని సోషల్‌ విూడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. అయితే గడ్డం పెరిగే బన్నీ షూటింగ్‌కు వచ్చేలోపు సుకుమార్‌ ట్రిప్‌కు వెళ్లబోతున్నాడని తెలుస్తుంది. దీంతో ఈ విషయం నిజామా కాదా అనేది తెలియాలంటే చిత్రబృందం ప్రకటించేవరకు ఆగాల్సిందే. మరోవైపు వీరి గొడవ వలన ఈ షూటింగ్‌ వాయిదా పడిందని..  ఇప్పటికే ఆగష్టు నుంచి డిసెంబర్‌కు వాయిదా పడిన ఈ చిత్రం డిసెంబర్‌లో అయిన విడుదల అవుతుందా లేదా 2025 లోకి వెళుతుందా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ మూవీ షూటింగ్‌ జూలై చివరి నాటికి ముగించాలని అల్లు అర్జున్‌ ఆర్డర్‌ వేసినట్లు సమాచారం. అయితే షూటింగ్‌ పూర్తి కావడానికి ఇంకో నెల సమయం పడుతుందని. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్‌లను సుకుమార్‌ రీడిజైన్‌ చేసినట్లు తెలుస్తుంది. దీంతో ఈ షూటింగ్‌ ఎఫెక్ట్‌ పడినట్లు సమాచారం. మరోవైపు వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ విషయంలో సుకుమార్‌ కన్విన్స్‌ కాకపోవడంతో అవి పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతుందని తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇంకా చదవండి: తేజస్‌ కంచర్ల విభిన్నమైన చిత్రం.. 'ఉరుకు పటేల' టైటిల్‌ రోల్‌తో మూవీ!

# Allu Arjun     # Pushpa     # Rashmika Mandanna    

trending

View More