స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా "ధూం ధాం" సినిమా ట్రైలర్ లాంఛ్
1 month ago | 5 Views
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. "ధూం ధాం" సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈరోజు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా "ధూం ధాం" సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ - "ధూం ధాం" సినిమా ట్రైలర్ నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఫుల్ ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ ట్రైలర్ ఆకట్టుకుంది. ఇండస్ట్రీలోని 80 పర్సెంట్ ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారు. ట్రైలర్ ఆద్యంతం ఫన్ అందించింది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. ప్రొడ్యూసర్ రామ్ కుమార్ గారు నాకు బాగా తెలిసిన వ్యక్తి. డైరెక్టర్ సాయి కిషోర్ గారు నేను శ్రీను వైట్ల గారి దగ్గర వర్క్ చేసినప్పటి నుంచి పరిచయం. ఆయనలో మంచి ఫన్ టైమింగ్ ఉంటుంది. వీరు చేసిన ప్రయత్నం సక్సెస్ కావాలి. ఈ నెల 8న సినిమా రిలీజ్ అవుతోంది. మీ అందరి సపోర్ట్ దక్కుతుందని కోరుకుంటున్నా. ధూం ధాం సినిమాకు మంచి రెవెన్యూ రావాలి. చేతన్ కు నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. అన్నారు.
"ధూం ధాం" సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - భూపతి ఫ్యామిలీలో కాబోయో అల్లుడిగా ఎన్ఆర్ఐ వెన్నెల కిషోర్ అడుగుపెట్టడంతో ట్రైలర్ బిగిన్ అయ్యింది. ఆయన కజిన్ గా హీరో చేతన్ అరంగేట్రం చేస్తాడు. పెళ్లి ఇంట హీరోతో పాటు వెన్నెల కిషోర్ చేసిన హంగామా కావాల్సినంత ఫన్ క్రియేట్ చేసింది. ఫారిన్ లో ఉన్నప్పుడే అతనికి హీరోయిన్ తో లవ్ స్టోరీ ఉంటుంది. హీరో ప్రేమకథకు అతను ఈ ఊరికి రావడానికి సంబంధం ఏంటి ?, తండ్రిని ప్రాణంగా ప్రేమించే కొడుకుగా హీరో ఆయన కోసం ఏం చేశాడు? అనేది ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. గోపీసుందర్ కంపోజ్ చేసిన మూడు ఛాట్ బస్టర్ సాంగ్స్ ట్రైలర్ కు ఆకర్షణగా నిలిచాయి. ఇలా ఎంటర్ టైన్ మెంట్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, సూపర్ హిట్ మ్యూజిక్ తో సాగిన "ధూం ధాం" ట్రైలర్.. థియేటర్ లో సినిమా చూసేందుకు కావాల్సినంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.
నటీనటులు - చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు
టెక్నికల్ టీమ్
డైలాగ్స్ - ప్రవీణ్ వర్మ
కొరియోగ్రఫీ - విజయ్ బిన్ని, భాను
లిరిక్స్ - సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి
ఫైట్స్ - రియల్ సతీష్
పబ్లిసిటీ డిజైనర్స్ - అనిల్, భాను
ఆర్ట్ డైరెక్టర్ - రఘు కులకర్ణి
ఎడిటింగ్ - అమర్ రెడ్డి కుడుముల
సినిమాటోగ్రఫీ - సిద్ధార్థ్ రామస్వామి
మ్యూజిక్ - గోపీ సుందర్
స్టోరీ స్క్రీన్ ప్లే - గోపీ మోహన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - శివ కుమార్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ - శ్రీనివాస్)
ప్రొడ్యూసర్ - ఎంఎస్ రామ్ కుమార్
డైరెక్టర్ - సాయి కిషోర్ మచ్చా
ఇంకా చదవండి: 200కి పైగా థియేటర్లలో నవంబర్ 29 న విడుదల కానున్న 'ఉక్కు సత్యాగ్రహం'