త్వరలోనే పట్టాలెక్కనున్న 'ధూమ్‌ 4’... కీలక పాత్రలో కనిపించనున్న సూర్య!

త్వరలోనే పట్టాలెక్కనున్న 'ధూమ్‌ 4’... కీలక పాత్రలో కనిపించనున్న సూర్య!

3 months ago | 51 Views

బాలీవుడ్‌లో తెరకెక్కిన హెయిస్ట్‌ యాక్షన్‌ ఫిల్మ్స్‌లో 'ధూమ్‌’ కు విశేష ఆదరణ ఉంది. 2004లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇప్పటికే పలు సీక్వెల్స్‌ వచ్చాయి. బాక్సాఫీస్‌ వద్ద అవన్నీ సూపర్‌ హిట్స్‌ అందుకున్నాయి. ఈ ఫ్రాంఛైజీలోనే త్వరలో 'ధూమ్‌ 4’ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాణసంస్థ యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ ఈమేరకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 'ధూమ్‌, పార్ట్‌ 2, 3’లకు కథను అందించిన ఆదిత్య చోప్రానే ’ధూమ్‌ 4’కీ వర్క్‌ చేస్తున్నారని.. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు అనుగుణంగా భారీస్థాయిలో దీనిని సిద్ధం చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇదిలాఉండగా, ఈ చిత్రంలో కోలీవుడ్‌ నటుడు సూర్య కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.


సినిమాలో ముఖ్యమైన ప్రతి నాయకుడి పాత్రలో సూర్య నటించనున్నారని.. ఈ విషయంపై చిత్రబృందం ఇప్పటికే ఆయన్ని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోల్‌లో యాక్ట్‌ చేసేందుకు ఆయన ఆసక్తి చూపారని టాక్‌. దీనిపై పలువురు సినీప్రియులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. సూర్య యాక్ట్‌ చేస్తే మరో స్థాయిలో ఉంటుందని వారు భావిస్తున్నారు. మరి కొంతమంది మాత్రం అధికారిక ప్రకటన కోసం వేచి చూస్తున్నామని అంటున్నారు. నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లో యాక్ట్‌ చేయడం సూర్యకు కొత్త ఏవిూ కాదు. ఆయన ఇప్పటికే '24’, 'విక్రమ్‌’ చిత్రాల్లో అలాంటి రోల్స్‌ పోషించారు. 2022లో వచ్చిన 'విక్రమ్‌’ చిత్రంలో రోలెక్స్‌గా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.  మాదక ద్రవ్యాల ముఠాకు నాయకుడిగా ఆయన నటన అందర్నీ కట్టిపడేసింది. రోలెక్స్‌ పాత్ర కనిపించేది కేవలం కొన్ని నిమిషాలే అయినప్పటికీ.. సినిమాకే హైలైట్‌గా నిలిచింది.

ఇంకా చదవండి: యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా 'మ్యాడ్‌'

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# Dhoom4     # Suriya     # RohiniSingh    

trending

View More