గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'డాకు మహారాజ్'
1 month ago | 5 Views
నందమూరి బాలకృష్ణ కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా చిత్రం ఎన్‌బీకే 109 దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి డాకు మహారాజ్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్‌బీకే 109 టైటిల్ అనౌన్స్‌మెంట్ టీజర్ రానే వచ్చేసింది.
ఈ కథ వెలుగును పంచే దేవుళ్లది కాదు.. చీకటిని పంచే రాక్షసులది కాదు.. ఆ రాక్షసులనే ఆడిరచే రావణుడిది కాడు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసే ఒక రాజుది.. గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది.. డాకు డాకు మహారాజ్ అంటూ సాగుతున్న టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
ఇంకా చదవండి: నయన ప్రేమకథ అలా మొదలైంది..!?