క్రైమ్ థ్రిల్లర్ 'తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి' మరియు 'నారదన్' ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్

క్రైమ్ థ్రిల్లర్ 'తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి' మరియు 'నారదన్' ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్

20 days ago | 5 Views

వెర్సటైల్ యాక్టర్ ప్రియదర్శి లీడ్ రోల్ లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి'. నిరంజన అనూప్, మణికందన్ ఆర్. ఆచారి ఇతర కీలక పాత్రలు పోషించారు. నారాయణ చెన్నా దర్శకత్వం వహించారు. బ్యాంక్ రాబరీ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ మూవీలో ప్రియదర్శి క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులని కట్టిపడేసింది. తనదైన నేచురల్ పెర్ఫామెన్స్, కామిక్ టైమింగ్ తో కథని ఆద్యంతం ఆకట్టుకునేలా నడిపారు ప్రియదర్శి. ఇప్పుడీ సినిమా భవానీ మీడియా ద్వారా ఆహ ఓటీటీలో  నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.  మలయాళం స్టార్ టోవినో థామస్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం నారదన్. అన్నా బెన్, షరాఫుద్దీన్, ఇంద్రన్స్, జాఫర్ ఇడుక్కి ఇతర కీలక పాత్రలు పోషించారు.


నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రంలో న్యూస్ యాంకర్ చంద్రప్రకాష్  పాత్రలో టోవినో మెస్మరైజ్ చేశారు.  నేటి TRP-బేస్డ్ మీడియా ల్యాండ్‌స్కేప్‌లో నైతిక జర్నలిజం పాత్రపై నారదన్ పవర్ ఫుల్ ప్రతిబింబం. 'నారదన్' జర్నలిస్టులు ఎదుర్కొనే సవాళ్లను, కథల కోసం కనికరంలేని అన్వేషణ, వారి అభిరుచి కోసం చాలా మంది భరించే సవాళ్లను ఎక్సయిటింగ్ ప్రజెంట్ చేస్తోంది.  మలయాళంలో విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ భావనీ మీడియా ద్వారా ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. నవంబర్ 29 నుంచి ఆహాలో ప్రసారం కానుంది. ఈ రెండు ఎక్సయిటింగ్ మూవీస్ ని వీకెండ్ లో ఆహా లో మిస్ అవ్వొద్దు.

ఇంకా చదవండి: ఘనంగా "ఝాన్సీ ఐపీఎస్" ప్రీ రిలీజ్ ఈవెంట్, నవంబర్ 29న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్.

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# నారదన్     # తప్పించుకుతిరుగువాడుధన్యుడుసుమతి     # ఆహా    

trending

View More