క్రేజీ రాంబో పెద్ద హిట్ కావాలి: టైటిల్ లాంచ్ ఈవెంట్ లో హీరో అశ్విన్ బాబు

క్రేజీ రాంబో పెద్ద హిట్ కావాలి: టైటిల్ లాంచ్ ఈవెంట్ లో హీరో అశ్విన్ బాబు

4 months ago | 56 Views

షమ్ము హీరోగా హరీష్ మధురెడ్డి దర్శకత్వంలో, ర్యాప్ రాక్ షకీల్ సప్తాశ్వ ప్రొడక్షన్స్ బ్యానర్ పై  ది అల్టిమేట్ మాస్ మసాలా ఎంటర్‌టైనర్ “క్రేజీ రాంబో” గ్రాండ్ గా ప్రారంభం- టైటిల్ లాంచ్  

షమ్ము హీరోగా హరీష్ మధురెడ్డి దర్శకత్వంలో, సప్తాశ్వ ప్రొడక్షన్స్ బ్యానర్ రూపొందనున్న ది అల్టిమేట్ మాస్ మసాలా ఎంటర్‌టైనర్ “క్రేజీ రాంబో” పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ వేడుకలో హీరో అశ్విన్ బాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.  

కామెడీ, యాక్షన్, డ్రామా, రొమాన్స్‌తో కూడిన రోలర్-కోస్టర్ రైడ్‌గా ఈ సినిమా వుండబోతోంది. రాంబో టైటిల్ రోల్  లో హీరో షమ్ము చాలా ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు.  సినిమా స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు, సంగీతం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించనున్నాయి. 

టైటిల్ లాంచ్ ఈవెంట్ లో హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. క్రేజీ రాంబో టైటిల్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. సినిమా తప్పకుండా క్రేజీ గా ఉంటుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్, సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించాలి' అని కోరారు.

హీరో షమ్ము మాట్లాడుతూ,.. ఇది నా మూడో సినిమా. మా అన్నయ్య ప్రొడక్షన్ లో వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంది. క్రేజీ రాంబో కథ చాలా బావుటుంది. అందరినీ అలరిస్తుంది' అన్నారు.  

నిర్మాత, సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ.. డైరెక్టర్ మధు గారు కథ చెప్పినపుడు నాకు చాలా నచ్చింది. మా తమ్ముడు హీరోగా నేనే నిర్మించాలని అనుకున్నాను. చాలా మంచి కంటెంట్. అందరినీ ఎంటర్ టైన్ చేసేలా సినిమా వుంటుంది' అన్నారు. 

ఈ చిత్రానికి ర్యాప్ రాక్ షకీల్ మ్యూజిక్ అందిస్తున్నారు, సినిమాటోగ్రఫీ  జైపాల్ రెడ్డి. 

ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలోనే తెలియజేస్తారు.  

తారాగణం: షమ్ము 

బ్యానర్ :  సప్తాశ్వ ప్రొడక్షన్స్,

రచన, దర్శకత్వం:  హరీష్ మధురెడ్డి

నిర్మాత, సంగీతం: ర్యాప్ రాక్ షకీల్ ,

సినిమాటోగ్రఫీ:  జైపాల్ రెడ్డి,

సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ, బాష్య శ్రీ,

స్టైలింగ్ : భవ్య నీలిమ

వీఎఫ్ఎక్స్ : వర్క్‌ఫ్లో

పీఆర్వో: తేజస్వి సజ్జా

ఈవెంట్ బై: సహారా మ్యూజిక్ ఫిల్మ్ స్టూడియో ప్రొడక్షన్

ఇంకా చదవండి: అల్లరి నరేశ్‌ కొత్త సినిమా ప్రారంభం!

# CrazyRambo     # AshwinBabu     # HarishMadhureddy    

trending

View More