కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌- 100 రోజుల్లో రానున్న పుష్ప-2 దిరూల్‌

కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌- 100 రోజుల్లో రానున్న పుష్ప-2 దిరూల్‌

2 months ago | 35 Views

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తకిగా ఎదురుచూస్తున్న చిత్రం 'పుష్ప-2' ది రూల్‌.. ఇక డిసెంబరు 6న థియేటర్స్‌లో ప్రారంభం కానున్న పుష్పరాజ్‌ రూల్‌కు కౌంట్‌స్టార్‌ అయ్యింది. మరో 100 రోజుల్లో అంటే డిసెంబరు 6న పుష్ప-2 రూల్‌ బాక్సాఫీస్‌పై ప్రారంభం కానుంది. ఇక రికార్డులు లెక్కపెట్టుకోవడమే.. పుష్ప దిరైజ్‌తో బార్డర్‌లు దాటిన  ఇమేజ్‌తో.. ఎవరూ ఎక్స్‌పెక్ట్‌ చేయని క్రేజ్‌తో దూసుకపోతున్న ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ 'పుష్ప-2'లో  అద్వితీయమైన నటన కోసం, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ టేకింగ్‌..మేకింగ్‌.. కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థల పతాకంపై ప్రముఖ నిర్మాతలు, నవీన్ ఏర్నేని, వై రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన రెండు సాంగ్స్‌, టీజర్‌కు ఎంతటి అనూహ్యమైన స్పందన వచ్చిందో తెలిసిందే. దేవి శ్రీప్రసాద్‌ అందించిన అందించిన ట్రెండీ పాటలకు అద్వితీయమైన స్పందన వచ్చింది. ఇక పుష్ప-2 ది రూల్‌ నుండి రానున్న ప్రతి ప్రమోషనల్‌ కంటెంట్‌ కూడా అంతే క్రేజీతో రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో వున్న ఈ చిత్రం, మరోవైపు నిర్మాణానంతర పనులను కూడా శరవేగంగా జరుపుకుంటోంది. కంటెంట్‌ పరంగానే కాకుండా టెక్నికల్‌గా కూడా పుష్ప-2 అత్యున్నత స్థాయిలో వుండబోతుంది. మీరు ఎంత ఎక్స్‌పెక్ట్‌ చేసిన అంతకు మించి తగ్గేదేలేలా పుష్ప-2 వుండబోతుందని హింట్‌ ఇస్తున్నారు మేకర్స్‌... ఇక డిసెంబరు 6న అందరూ డబుల్‌ మార్క్‌ చేసుకొని రెడీ వుండడి..!

అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి

కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.బి

నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్

సినిమాటోగ్రాఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: S. రామకృష్ణ - మోనిక నిగొత్రే

లిరిసిస్ట్: చంద్రబోస్

సీఈఓ: చెర్రీ

బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్

ఇంకా చదవండి: స్టైలిష్ న్యూ పోస్టర్‌తో నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన శేఖర్ కమ్ముల కుబేర టీమ్

# Pushpa2     # AlluArjun     # FahadhFaasil     # RashmikaMandanna    

trending

View More