నీహారిక నిర్మాతగా 'కమిటీ కుర్రోళ్లు'!
4 months ago | 39 Views
నిహారిక కొణిదెల సమర్పణలో రూపొందిన తాజా చిత్రం 'కమిటీ కుర్రోళ్లు’ ట్రైలర్ విడుదలయ్యింది. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషించారు. యదువంశీ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈసందర్భంగా చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిద్ధూ జొన్నలగడ్డ.. ఇది మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకున్నారు. ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో భాగమైనందుకు ఆనందిస్తున్నా. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థాంక్యూ. ఇది చిన్న సినిమా కాదు. కొత్త వాళ్లతో ఇలాంటి విభిన్నమైన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నందుకు నిహారికను మెచ్చుకోవాలి.
ఓవైపు వ్యాఖ్యాతగా, హీరోయిన్‌గా చేస్తూనే చిత్రాలను నిర్మించడం అంత సులభం కాదు. ఆమెలో ఒక వ్యాపారవేత్తను చూస్తున్నా. ఈ సినిమా మంచి వసూళ్లు అందించాలని కోరుకుంటున్నా. తెలుగు సినిమా ఇప్పుడు మంచిస్థాయిలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా మన సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. తక్కువ బ్జడెట్‌తో నిర్మితమైన చిత్రాలను సైతం ప్రోత్సహిస్తూ మనం మరింత ఉన్నత శిఖరాలకు వెళ్తున్నాం అని తెలిపారు. ఈసందర్భంగా నిహారిక తమ సినిమా కోసం కష్టపడిన ప్రతిఒక్కరికీ థాంక్యూ చెప్పారు.
ఇంకా చదవండి: హీరో కృష్ణసాయి మూవీ ''జ్యువెల్ థీఫ్'' టీజర్, ఆడియో లాంచ్
# CommitteeKurrollu # SandeepSaroj # YaswanthPendyala # NiharikaKonidela # August9