రాజా సాబ్ సినిమా లో అమితాబ్ ఐకానిక్ సాంగ్ రీమిక్స్ పై క్లారిటీ వచ్చేసింది..
5 months ago | 45 Views
మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాజా సాబ్. ఇప్పటికే ఈ చిత్రం 50% షూటింగ్ పూర్తి చేసుకుంది మరియు అతి త్వరలో, మేకర్స్ హైదరాబాద్‌లో ప్రభాస్‌తో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు. అయితె ఈ సినిమాకు ప్రభాస్ ఒక హిందీ పాటను రీమిక్స్ చేస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతుంది.
అమితాబ్ బచ్చన్ డాన్ నుండి కైకే పాన్ బనారస్వాలా అనే పాటను మూవీ మేకర్స్ రీమిక్స్ చేస్తున్నట్టు తెలిసింది. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని, ఐకానిక్ అమితాబ్ బచ్చన్ పాట రీమిక్స్ హక్కులను తాము కొనుగోలు చేయలేదని ప్రొడక్షన్ హౌస్ యువి క్రియేషన్స్ టీమ్ సభ్యుల్లో ఒకరు వెల్లడించారు. దీనితో పుకార్లకి అక్కడే ఫుల్స్టాప్ పడింది. మారుతి తన సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ఉన్న సంగతి తెలిసిందే, పాత పాటను రీమిక్స్ చేస్తున్నాడని వార్తలు వచ్చినప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ చాలా రెచ్చిపోయారు. ఫాన్స్ అందరూ ప్రభాస్ ను వినోదాత్మక పాత్రలో చూసి చాలా కాలం అయ్యింది మరియు చాలా గ్యాప్ తర్వాత రాజా సాబ్ తో అతనిని సరైన కమర్షియల్ సినిమా జోనర్‌లోకి తీసుకువచ్చాడు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తోంది. హారర్ రొమాంటిక్ కామెడీగా రూపొందించ బడుతున్న ఈ సినిమా కోసం ఆయన ఇప్పటికే మూడు ట్యూన్లను లాక్ చేశారు.