'దేవర' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు దురదృష్టకరం :  అభిమానులకు క్షమాపణలు చెప్పిన నిర్వాహకులు

'దేవర' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు దురదృష్టకరం : అభిమానులకు క్షమాపణలు చెప్పిన నిర్వాహకులు

2 months ago | 36 Views

'దేవర’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు కావడం దురదృష్టకరమని కార్యక్రమం నిర్వాహకులు అన్నారు. ఎన్టీఆర్‌ అభిమానులకు క్షమాపణలు చెబుతూ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఎక్స్‌ వేదికగా ఈ ఈవెంట్‌ కోసం వాళ్లు చేసిన ఏర్పాట్ల వివరాలను తెలుపుతూ పోస్ట్‌ పెట్టారు. ఎన్టీఆర్‌పై విూ అందరికీ ఉన్న అపారమైన అభిమానం, ప్రేమను మేము అర్థం చేసుకున్నాం. ఆరు సంవత్సరాల తర్వాత సోలోగా తెరపై కనపడుతుండడంతో విూరంతా మరింత ఉత్సాహంగా ఉన్నారు. తాజాగా జరిగిన పరిణామంతో విూరంతా నిరుత్సాహానికి గురయ్యారని బరువెక్కిన హృదయంతో ఈ నోట్‌ను విడుదల చేస్తున్నాం. ఇందులో అక్కడ జరిగిన పరిస్థితిని పూర్తిగా వివరించాలన్నదే మా ప్రయత్నం. విూకు జరిగిన అసౌకర్యానికి హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాం. ఎన్టీఆర్‌ అభిమానులను దృష్టిలోపెట్టుకొని మేము ఈ ఈవెంట్‌ను బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటుచేయాలని భావించాం. కానీ, వినాయక చవితి వేడుకలు, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో దీన్ని హోటల్‌లో ఏర్పాటుచేయాల్సి వచ్చింది. పరిమితులకు మించి పాస్‌లు ఇచ్చామంటూ సోషల్‌ విూడియాలో జరుగుతోన్న ప్రచారం పూర్తిగా అబద్ధం. మేం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ 30, 35వేల మంది అభిమానులు హాజరయ్యారు. అధిక సంఖ్యలో ప్రజలు రావడంతో గేట్లు కిక్కిరిసిపోయాయి. బారికేడ్లు పగలగొట్టడంతో పరిస్థితి అదుపుతప్పింది. దీంతో ఈవెంట్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. అదుపు చేయలేని పరిస్థితులు తలెత్తడంతో మేం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అభిమానుల భద్రత దృష్ట్యా 

ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాం. ఎన్టీఆర్‌పై విూకున్న అచంచలమైన మద్దతు, అంకితభావం ఆయన్ని ఈ స్థాయిలో ఉంచాయి. మమ్మల్ని విూరు ఎప్పటికీ ఇలానే సపోర్ట్‌ చేస్తారని ఆశిస్తున్నాం‘ అని తెలుపుతూ శ్రేయాస్‌ విూడియా ఓ లేఖను విడుదల చేసింది.కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన ;దేవర’ సినిమా భారీ అంచనాల మధ్య  27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈనేపథ్యంలో ఏర్పాటుచేసిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు కావడంపై ఎన్టీఆర్‌, జాన్వీకపూర్‌లు ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈవెంట్‌ రద్దు కావడం బాధాకరమన్నారు.

ఇంకా చదవండి: ఆస్కార్‌కు 'లాపతా లేడీస్‌' ఎంపిక!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# Devara     # Janhvikapoor     # Ntr    

trending

View More