'కన్నప్ప'తోనైనా మంచు విష్ణుకు హిట్టు పడేనా..?

'కన్నప్ప'తోనైనా మంచు విష్ణుకు హిట్టు పడేనా..?

1 month ago | 5 Views

మంచు విష్ణు హీరోగా ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు దాటింది. ఇన్నాళ్ల సినీ ప్రస్థానంలో విష్ణు దక్కించుకున్న విజయాలు ఎన్ని అంటే చాలా చాలా తక్కువ అని చెప్పాలి. కెరీర్‌ ఆరంభంలో కాస్త పర్వాలేదు అనిపించినా గత పదేళ్ల కాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు తక్కువే, అందులో ఆయనకు ఒక్క హిట్టు కూడా లేదు. అయినా తన ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో స్వీయ నిర్మాణంలో మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమాను చేస్తున్నారు.

మంచు విష్ణు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 20 ఏళ్లు పూర్తి అయింది. మొదటి పదేళ్లు స్పీడ్‌గా సినిమాలు చేసి, పర్వాలేదు అన్నట్లు ఫలితాలు సొంతం చేసుకున్న విష్ణుకు కొన్ని సూపర్‌ హిట్‌లు సైతం దక్కాయి. కానీ గత పదేళ్లుగా ఒక్క సినిమా సైతం హిట్‌ కాలేదు. పైగా ప్రతి సినిమా డిజాస్టర్‌, అంతకు మించి అన్నట్లుగా దారుణ ఫలితాలను చవిచూశాయి.

విభిన్న చిత్రాలను ఎంపిక చేసుకుని, ప్రతి సినిమాకు చాలా కష్టపడుతున్నా మంచు విష్ణుకు ఆశించిన సక్సెస్‌ మాత్రం రావడం లేదనిపిస్తుంది. తనపై ఎంతగా విమర్శలు వచ్చినా, తన సినిమాలు ఎంతటి డిజాస్టర్‌ను చవిచూసినా తన ప్రయత్నాలను మాత్రం మానడం లేదు. సినిమాపై ఉన్న ఆసక్తితో వరుసగా ప్రాజెక్టులు చేస్తూనే ఉన్నాడు. ఈసారి ఏకంగా భారీ బడ్జెట్‌తో ‘కన్నప్ప’ అనే సినిమాను చేస్తున్నారు. మొదట్లో అనుకున్న స్థాయికి రెట్టింపు కన్నప్ప బడ్జెట్‌ చేరినట్టుగా కనిపిస్తోంది. భారీ క్యాస్టింగ్‌తో కన్నప్పను గ్ష్రాండ్‌ లెవెల్లో విష్ణు నిర్మిస్తున్నాడు.

ఇంకా చదవండి: గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న 'డాకు మహారాజ్‌'

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# కన్నప్ప     # మోహన్‌బాబు     # మంచు విష్ణు    

trending

View More