'బ్రహ్మ ఆనందం' గ్లింప్స్‌ విడుదల

'బ్రహ్మ ఆనందం' గ్లింప్స్‌ విడుదల

4 months ago | 38 Views

 టాలీవుడ్‌ కామెడీ కింగ్‌ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ’బ్రహ్మ ఆనందం’. వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా ఆర్‌వీఎస్‌ నిఖిల్‌ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. మసూద లాంటి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుడగా..

రాఖీ పండుగ సందర్భంగా మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌ చూస్తే.. హీరో దరిద్రంను పర్స్‌లో పెట్టుకుని బ్రతుకుతున్నట్లు తెలుస్తుంది. మరి ఆ దరిద్రం నుంచి హీరో బయటపడ్డడా లేదా అనేది తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే. ఫుల్‌ హిలేరియస్‌గా ఉన్న ఈ గ్లింప్స్‌ ప్రస్తుతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను డిసెంబర్‌ 06న విడుదల చేయననున్నారు మేకర్స్‌. ఇక ఈ గ్లింప్స్‌ చివరిలో బ్రహ్మానందం పంచెకట్టులో మాస్‌ ఎంట్రీ ఇచ్చాడు.

ఇంకా చదవండి: 22 నుంచి ఓటిటిలోకి 'కల్కి'

# Brahmanandam     # RajaGoutham     # VennelaKishore    

trending

View More