భార్గవి నిలయం (నీలవేలిచం) ఆహా లో స్ట్రీమింగ్ :-: సింబా Amazon Prime & Ahaలో స్ర్టీమింగ్

భార్గవి నిలయం (నీలవేలిచం) ఆహా లో స్ట్రీమింగ్ :-: సింబా Amazon Prime & Ahaలో స్ర్టీమింగ్

3 months ago | 42 Views

భార్గవి నిలయం: 

జానర్: హారర్, రొమాన్స్, డ్రామా

నటీనటులు: టోవినో థామస్, రిమా కల్లింగల్, రోషన్ మాథ్యూ, షైన్ టామ్ చాకో తదితరులు

కథాంశం:  బ‌షీర్ (టోవినో థామ‌స్‌) ఓ రైట‌ర్‌. క‌థ రాయ‌డానికి స‌ముద్రం ఒడ్డున ఉన్న ప‌ల్లెటూరికి వ‌స్తాడు. ఊరి చివ‌ర ఉన్న భార్గవి నిల‌యం అనే పురాత‌న భ‌వంతిలో అద్దెకు దిగుతాడు. ఆ ఇంట్లో భార్గవి (రీమా క‌ల్లింగ‌ల్‌) అనే అమ్మాయి ఆత్మ ఉంద‌ని అంద‌రూ చెప్పుకుంటారు. కొంద‌రు ఆ ఆత్మను నిజంగానే చూస్తారు. ఇంట్లో ఎవ‌రూ అడుగుపెట్టినా స‌హించ‌ని భార్గవి ఆత్మ బ‌షీర్‌ను మాత్రం ఏం చేయ‌దు. భార్గవి గురించి ఊరంద‌రూ ర‌క‌ర‌కాల క‌థ‌లు చెబుతారు. 

ఆమె చావు వెనుక ఉన్న అస‌లు నిజం ఏమిటో తెలుసుకొని దానినే క‌థ‌గా రాయాల‌ని బ‌షీర్ నిర్ణ‌యించుకుంటాడు? ఈ క్ర‌మంలో అత‌డికి ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌య్యాయి? అస‌లు భార్గ‌వి ఎలా చ‌నిపోయింది? భార్గ‌వి ప్రేమించిన శివ‌కుమార్ (రోష‌న్ మాథ్యూ) అదృశ్యం కావ‌డానికి కార‌ణం ఏమిటి? భార్గ‌వి మేన‌మామ నారాయ‌ణ‌న్ (టామ్ చాకో)...బ‌షీర్‌ను చంప‌డానికి ఎందుకు ప్ర‌య‌త్నించాడు? అన్న‌దే “భార్గవి నిలయం” క‌థ‌. హర్రర్ సినిమా ఫీల్ తో పాటు మంచి ప్రేమ కథ కూడా ఇందులో చూపించారు.

SIMBAA: Amazon Prime & Ahaలో స్ర్టీమింగ్

జానర్: సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్

నటీనటులు: అనసూయ, జగపతి బాబు, కస్తూరి, దివి, శ్రీనాథ్, కబీర్ సింగ్

"సింబా" అనేది బయోలాజికల్ మెమరీ కాన్సెప్ట్, పర్యావరణ సందేశంతో మిళితం చేసే గొప్ప ప్రయత్నం.

ఒకరితో ఒకరికి సంబంధం లేని వ్యక్తులు స్కూల్ టీచర్ (అనసూయ), జర్నలిస్ట్ (శ్రీనాథ్), డాక్టర్ (అనీష్ కురువిళ్ళ). కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఒక్కొక్కరిగా మెుదలు పెట్టి, ముగ్గురూ కలిసి అతి దారుణంగా హత్యలు చేస్తారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో హత్యలు వారి ప్రమేయం లేకుండా జరిగాయని, దానికి కారణం పర్యావరణ ప్రేమికుడు పురుషోత్తం రెడ్డి (జగపతిబాబు) అని తెలుస్తుంది. ఎప్పుడో చనిపోయున వ్యక్తి ఇప్పుడు ఎలా చంపాడు? బయాలాజికల్ మెమరీ ఏంటి? గతం వర్తమానంలోకి ఏలా వచ్చింది?

ఈ రెండు సినిమాలనూ “భవానీ మీడియా” డిజిటల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది.

ఇంకా చదవండి: తిరుపతి ఎస్ఐటీ కాలేజీలో ఘనంగా హైడ్ న్ సిక్ ట్రయిలర్ లాంచ్

# Simbaa     # JagapathiBabu     # AnasuyaBharadwaj     # Aha    

trending

View More