'భారతీయుడు-2' విడుదలకు సిద్దం

'భారతీయుడు-2' విడుదలకు సిద్దం

27 days ago | 17 Views

'భారతీయుడు 2’తో సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు కమల్‌హాసన్‌. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని శంకర్‌ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 28ఏళ్ల క్రితం వీళ్లిద్దరి కలయికలో వచ్చిన విజయవంతమైన సినిమా  'భారతీయుడు’కు కొనసాగింపుగా రూపొందింది. లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌ జెయింట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కాజల్‌ కథానాయిక. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సిద్దార్థ్‌, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా జులై 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చెన్నైలో ఇటీవల పాటల విడుదల వేడుక నిర్వహించారు. శింబు, లోకేశ్‌ కనగరాజ్‌, నెల్సన్‌, ఏఎం రత్నం తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో కమల్‌హాసన్‌ మాట్లాడుతూ.. 28 ఏళ్ల క్రితం నేను శివాజీ గణెశన్‌తో ఓ సినిమా చేద్దామనుకుంటున్న సమయంలోనే శంకర్‌ 'భారతీయుడు’ కథతో నా దగ్గరకు వచ్చారు. ఆ కథలు రెండూ కొంచెం దగ్గరగా ఉండటంతో శివాజీ గణెశన్‌కు చెప్పా. ఆయన 'శంకర్‌తోనే సినిమా చేయండి.. మనం ఇప్పటికే ఎన్నో చిత్రాలు కలిసి చేశామ’ని నాతో అన్నారు.

ఆ ఒక్క మాట, నమ్మకంతో 'భారతీయుడు’ చేశా. అప్పట్లోనే నేను సీక్వెల్‌ చేద్దామని అడిగా. కానీ, శంకర్‌ కథ రెడీగా లేదన్నారు. మళ్లీ 28ఏళ్లకు 'భారతీయుడు -2’ చేశాం. నిర్మాత సుభాస్కరన్‌ వల్లే ఈ చిత్రం ఇక్కడి వరకు వచ్చింది. ఆయన మాపై పెట్టిన నమ్మకమే ఈ సినిమా. అనిరుధ్‌ దీనికి అద్భుతమైన సంగీతమందించారు అన్నారు. 'భారతీయుడు తాత మంచి వాళ్లకు మంచివాడు.. చెడ్డవాళ్లకు చెడ్డవాడు. కమల్‌హాసన్‌ 360డిగ్రీల కంటే ఒక డిగ్రీ ఎక్కువ నటించే సత్తా ఉన్న నటుడు. 70 రోజుల పాటు మేకప్‌తో నటించారు. ఆయన లాంటి నటుడు ప్రపంచంలోనే లేరు. తనతో 'భారతీయుడు 2’, 'భారతీయుడు 3’ చేయడం ఆనందంగా ఉంది. ఈ రెండూ 'భారతీయుడు’ కంటే పెద్ద హిట్‌ అవుతాయి‘ అన్నారు దర్శకుడు శంకర్‌. ఈ కార్యక్రమంలో అనిరుధ్‌, బాబీ సింహా, గుల్షన్‌ గ్రోవర్‌, జ్ఞానాంబిక, బ్రహ్మానందం, రకుల్‌, కాజల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇంకా చదవండి: 'హీరామండి' సెకండ్‌ సీజన్‌ ప్రకటన!

# Indian2     # Bharateeyudu2     # KamalHaasan     # TeluguCinema    

trending

View More