జియో చేతికి 'భగవంత్‌ కేసరి' హిందీవర్షన్‌!

జియో చేతికి 'భగవంత్‌ కేసరి' హిందీవర్షన్‌!

1 month ago | 21 Views

నందమూరి నటసింహం బాలయ్య  నటించిన 'భగవంత్‌ కేసరి’ చిత్రం గత ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఈ ఈ సినిమాలో కాజల్‌ కథానాయికగా నటించింది.  యంగ్‌ బ్యూటీ శ్రీలీల ముఖ్య పాత్రలో నటించింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ విలన్‌గా నటించాడు. ఈ మూవీని సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించగా..

ఈ సినిమా  70 కోట్లకు పైగా షేర్‌ ని అలాగే 132 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టింది. ఈ సినిమాలో తెలంగాణ యాసలో బాలయ్య చెప్పే డైలాగ్స్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. థియేటర్స్‌లోనే కాదు ఓటీటీలో కూడా మంచి రేటింగ్‌తో అదరగొట్టింది. తాజాగా ఈ బిగ్గెస్ట్‌ యాక్షన్‌ మూవీ హిందీ వెర్షన్‌  స్ట్రీమింగ్‌  రైట్స్‌ను జియో సినిమా సొంతం చేసుకుంది. ప్రస్తుతం హిందీ వెర్షన్‌ లో  స్ట్రీమింగ్‌  అవుతోంది.

ఇంకా చదవండి: ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో 'రాయన్‌'

# BhagavanthKesari     # NandamuriBalakrishna     # Sreeleela     # TeluguCinema