శంభాజీ మహారాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా 'ఛావా' విడుదల కానుంది

శంభాజీ మహారాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా 'ఛావా' విడుదల కానుంది

25 days ago | 17 Views

కొంతకాలంగా బాలీవుడ్‌లో బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోన్న సంగతి తెలిసిందే! 'సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’, 'తానాజీ’, 'పానిపట్‌’, 'బాజీరావ్‌ మస్తానీ’, 'పద్మావత్‌’ సంజూ', 'మేరీకోమ్‌' ఇలా చాలా చిత్రాలు చక్కని విజయం, వసూళ్లు సాధించాయి. ఇప్పుడు మరో హిస్టారికల్‌ సినిమా వెండితెరపై దర్శనమివ్వబోతోంది. అదే 'ఛావా’. బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌, నేషనల్‌ క్రష్‌ రష్మిక ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కుతోందీ. 'మిమి’, 'చుప్పి’ ఫేమ్‌ దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహారాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కు తోంది.


సినిమాలో శంభాజీ భార్య ఏసుబాయి  పాత్రలో నటించనుంది రష్మిక. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం అఫీషియల్‌గా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది. డిసెంబర్‌ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది. ఈ ప్రచార చిత్రంలో వందలాది మంది శత్రువులతో పోరాడే యుద్థ వీరుడు శంబాజీగా తన నట విశ్వరూపం చూపించారు విక్కీ కౌశాల్‌. ఈ చిత్రం కోసం ఆయన గుర్రపు స్వారీ తో పాటు పలు విద్యలు నేర్చుకున్నారు. ఇంతకుముందు ఎప్పుడు విక్కీ ఇలాంటి వీరోచిత పాత్ర చేయలేదు. ఈపాత్ర ఆయన కెరీర్‌కు ల్యాండ్‌ మార్క్‌ అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ టీజర్‌ సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది.

ఇంకా చదవండి: "నేను-కీర్తన" ట్రైలర్ కు అనూహ్య స్పందన!!

# Chhaava     # Vickykaushal     # Rashmikamandanna    

trending

View More