ఫిలిమ్ ఫేర్ అవార్డుల్లో 'బలగం' సినిమా సత్తా!
5 months ago | 42 Views
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజ్ బ్యానర్‌లో జబర్దస్త్ కమెడియన్ దర్శకుడు వేణు డైరెక్షన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్‌చిత్రం 'బలగం’ చిత్రం 2024 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో సత్తా చాటింది. ఈ చిత్రం ఏకంగా 8 కేటగిరీల్లో నామినేట్ అయ్యింది. ఈ విషయాన్ని దిల్ రాజ్ ఎక్స్ వేదికగా వెల్లడించాడు. తాజాగా ఈ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహయ నటుడు, ఉత్తమ సంగీతం, ఉత్తమ లిరిక్స్, ఉత్తమ సహయ నటితో పాటు ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (మేల్, ఫిమేల్) కేటగిరీల్లో నామినేట్ అయ్యింది. ఇక అవార్డు ఫలితాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఫిల్మ్ ఫేర్ ప్రకటించింది. ఈ చిత్రంలో ప్రియదర్శి , కావ్య కల్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించగా.. వేణు ఎల్దండి, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రచనా రవి కీలక పాత్రల్లో కనిపించారు.తెలంగాణలోని కుటుంబ మూలాలు, భావోద్వేగాల నేపథ్యంలో గత ఏడాది విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలంగాణలోని ప్రతి ప్లలె చూసిందంటే ప్రేక్షకులకు ఎంత నచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
ఇంకా చదవండి: 'సర్దార్-2' షూటింగ్‌లో విషాదం.. ప్రమాదవశాత్తు స్టంట్ మాస్టర్ ఎజుములై మృతి
# Balagam # Priyadarshi