క్రిస్మస్‌కు విడుదల కానున్న 'బేబీ జాన్'
3 months ago | 40 Views
నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్ బీటౌన్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం బేబీ జాన్ బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధవన్ లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 25న ప్రపంచవాప్తంగా క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ మూవీలో వరుణ్ ధవన్ ఇదివరకెన్నడూ చూడనటువంటి అద్భుతమైన పాత్రలో కనిపించబోతున్నాడంటున్నారు నిర్మాత జ్యోతి దేశ్‌పాండే. వరుణ్ ధవన్ స్టన్నింగ్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చాడని.. బేబీ జాన్ ప్రతీ ఒక్కరీ మనసు దోచేస్తున్నారు.
అంతేకాదు ఈ సినిమాకు ప్రాంఛైజీగా కూడా మారొచ్చన్నారు. ఇది సీక్వెల్ కాదని.. పాత్ర ఆధారంగా సాగే ప్రాంఛైజీ అని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై క్లారిటీ రావడానికి మరికొన్ని నెలలు పడుతుందని చెప్పారు. ఇప్పుడీ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో కీర్తి సురేశ్ వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. వామికా గబ్బి మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. సినీ1 స్టూడియోస్, జియో స్టూడియోస్‌తో కలిసి ప్రియాఅట్లీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. బేబీజాన్ కీర్తిసురేశ్ బాలీవుడ్ డెబ్యూ సినిమా కావడం విశేషం. ఇందులో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇంకా చదవండి: సల్మాన్ 'సికిందర్'లో కాజల్ అగర్వాల్
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!