'బాక్' మే3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్

'బాక్' మే3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్

2 months ago | 29 Views

అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నుంచి నాల్గవ చిత్రం అరణ్మనై 4 తెలుగులో 'బాక్' పేరుతో వస్తోంది. సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోయిన్స్. 

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న విడుదల చేయడానికి తొలుత సన్నాహాలు చేశారు మేకర్స్. అయితే ఎండల తీవ్రత అధికంగా వుండటం వలన విడుదల తేదిని వాయిదా వేస్తూ కొత్త తేదిని తెలియజేశారు. మే 3న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన  'పంచుకో' పాట అద్భుతమైన రెస్పాన్స్ తో చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. త్వరలోనే ట్రైలర్ ని విడుదల చేసి తెలుగు ప్రమోషన్స్ ని దూకుడుగా చేయబోతున్నారు మేకర్స్.   అవ్నీ సినిమాక్స్  P Ltd పతాకంపై ఖుష్బు సుందర్, ACS అరుణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఈ చిత్రానికి కృష్ణమూర్తి డీవోపీగా పని చేస్తుండగా, ఎడిటింగ్‌ను ఫెన్నీ ఆలివర్‌ పర్యవేక్షిస్తున్నారు. గురురాజ్ ఆర్ట్ డైరెక్టర్.  

తారాగణం: సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా, వై వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్,  కోవై సరళ

సాంకేతిక సిబ్బంది:

కథ & దర్శకత్వం: సుందర్ సి

నిర్మాతలు: ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్

బ్యానర్: అవ్నీ సినిమాక్స్క్స్ P Ltd.

తెలుగు రిలీజ్: ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి

సంగీతం: హిప్హాప్ తమిళా

సినిమాటోగ్రాఫర్: ఇ కృష్ణమూర్తి అకా కిచ్చ

ఎడిటర్: ఫెన్నీ ఆలివర్

ఆర్ట్: గురురాజ్

కొరియోగ్రఫీ: బృందా మాస్టర్

స్టంట్స్: రాజశేఖర్

పీఆర్వో: వంశీ-శేఖర్

ఇంకా చదవండి: 'రుస్లాన్' ఎక్స్ ట్రార్డినరీ మూవీ పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా : మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ లో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్

# Aranmanai 4     # Tamannaah Bhatia     # Rashi Khanna     # Santhosh Prathap