చిత్రసీమకు మరో వారసుడు.. ఎంట్రీ ఇచ్చిన బాలయ్య తనయుడు మోక్షజ్ఞ

చిత్రసీమకు మరో వారసుడు.. ఎంట్రీ ఇచ్చిన బాలయ్య తనయుడు మోక్షజ్ఞ

8 months ago | 71 Views

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం వచ్చేసింది. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం చేశారు. యంగ్‌ ప్రశాంత్‌ వర్మ బాలయ్య కుమారుడిని వెండితెరకు పరిచయం చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ పోస్ట్‌ పెట్టారు. ’సింబా ఈజ్‌ కమింగ్‌’ అంటూ మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన లుక్‌ను విడుదల చేశారు. దీంతో అభిమానులు విషెస్‌ చెబుతున్నారు. తొలి సినిమాకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ కామెంట్స్‌ చేస్తున్నారు.రెండు రోజులుగా ప్రశాంత్‌ వర్మ వరుస పోస్ట్‌లతో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి హింట్‌ ఇస్తూ వచ్చారు. ’నా యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’, ’వారసత్వాన్ని ముందుకుతీసుకెళ్లే అద్భుత క్షణం’ అంటూ వరుస పోస్ట్‌లు పెట్టారు.

తాజాగా మోక్షజ్ఞ లుక్‌ను పంచుకొని తన తర్వాత సినిమా హీరో అంటూ బాలయ్య వారసుడిని పరిచయం చేశారు. ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి రెండో ప్రాజెక్ట్‌గా రానున్న సినిమాలో మోక్షజ్ఞ  అలరించనున్నారు.  తన సినిమాటిక్‌ యూనివర్స్‌కు సంబంధించి ప్రస్తుతం 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని.. తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్‌ హీరోల సినిమాలు తీస్తామని గతంలో ప్రశాంత్‌ వర్మ వివరించారు. ఏడాదికి ఒక సినిమా కచ్చితంగా విడుదల చేస్తానని ఆయన చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా కథ ఏమై ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇంకా చదవండి: ప్రియదర్శి, మోహనకృష్ణ ఇంద్రగంటి కలయికలో శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న 'సారంగపాణి జాతకం' షూటింగ్ పూర్తి

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !


# Balakrishna     # NandamuriMokshagnyaTeja